భారీ బడ్జెట్ సినిమాలకు ఏపీ సర్కార్ షాక్.. కొత్త ట్విస్ట్ తో రిలీజ్ డేట్ల మీద అనుమానాలు?

సినిమా టికెట్ల విషయంలో ఇప్పుడు పెద్ద సినిమాలకు మరో షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% సీటింగ్ సామర్థ్యం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నాలుగు షోలు వేసుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టికెట్ రేట్లు పెంపు కూడా ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో ఇప్పట్లో అలాంటి ఉద్దేశం లేదని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ఆశతో

ఆశతో

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాలీవుడ్ మధ్య కొద్ది రోజుల నుంచి చర్చోప చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మళ్లీ రేట్లు పెంచుకునేందుకు నిర్మాతలు అనేక ప్రయత్నాలు చేశారు.. 100% ఆక్యుపెన్సీ ఇవ్వాలని, నాలుగు షోలు వేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వాలని చెబుతూ టాలీవుడ్ నిర్మాతల బృందం దాదాపు రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భేటీ అయింది.

ఉద్దేశం లేదని

ఉద్దేశం లేదని

అయితే ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారం కాస్త లేట్ అవుతుందని అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్వరమే స్పందించి 100% సీటింగ్ సామర్థ్యం అనుమతి ఇచ్చి, అలాగే నైట్ కర్ఫ్యూ సమయాన్ని కుదించి నాలుగో షో కూడా వేసుకునే అవకాశం ఇచ్చింది. అయితే మరి కొద్ది రోజులలో టికెట్ రేట్లు కూడా పెంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తారు అని భావిస్తున్న తరుణంలో ఇప్పట్లో ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదని సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది.

 2022 వేసవికి

2022 వేసవికి

నిజానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పట్లో టికెట్ రేట్లు పెంచే ఉద్దేశ్యం లేదని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొత్త ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకున్న తరువాత మాత్రమే టికెట్ రేట్లు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.. అయితే ఈ ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకు రావడానికి మరో ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉందని, 2022 వేసవి కాలానికి ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

షాకింగ్ గా

షాకింగ్ గా

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% సీటింగ్ సామర్థ్యం పెంచడంతోపాటు నాలుగు షోలు వేసుకునే అవకాశం ఇవ్వడంతో ఇక రేట్లు కూడా పెంచే అవకాశం ఉంటుందని భావించి ఇప్పటికే పెద్ద సినిమాల నిర్మాతలు దాదాపుగా రిలీజ్ డేట్లు ప్రకటించారు. షూటింగ్ పూర్తి కాని కొన్ని సినిమాల విషయం పక్కన పెడితే దాదాపు మిగతా సినిమాలన్నీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం షాకింగ్ గా ఉందనే చెప్పాలి.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
 త్వరలోనే అధికారికంగా

త్వరలోనే అధికారికంగా

ఇది ఈ విషయం ప్రస్తుతం ఆఫ్ ది రికార్డుగా చెప్పుకుంటున్నా సరే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలలో టెన్షన్ రేకెత్తించేలా చేస్తోంది. ఈ విషయం మీద టాలీవుడ్ నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X