twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Tollywood: ఏపీలో టికెట్ల రేట్లపై కొత్త జీవో.. అమలులోకి వచ్చేది ఆ రోజు నుంచే?

    |

    టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఒక వైపు నుంచి కరోనా కారణంగా సినిమా బిజినెస్ చాలా తగ్గిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన షాక్ అయితే అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా సినిమా టికెట్లు భారీగా తగ్గించడంతో సినిమాల మార్కెట్ పై తీవ్ర స్థాయిలో ప్రభావం పడేలా చూపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ సమాన రేట్లకు వినోదాన్ని అందించాలి అనే నినాదాన్ని తీసుకువచ్చి ఒక్కసారిగా టికెట్ల రేట్లను తగ్గించడం తీవ్రంగా దెబ్బ పడింది అనే చెప్పాలి. ఇక టికెట్ల రేట్లను మళ్లీ ఎప్పటి తరహాలోనే తీసుకురావాలి అని ఇండస్ట్రీలోని చాలా మంది ప్రభుత్వ పెద్దలతో మాట్లాడడం జరిగింది. కానీ ఎన్నిసార్లు చర్చలు జరిపిన కూడా త్వరలోనే కొత్త జీవో వస్తుంది అని అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త నిర్ణయం తీసుకుంటామని కూడా అన్నారు.

    గత నెల చిరంజీవి ఆధ్వర్యంలో మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి కొరటాల శివ అలాగే మరికొంత మంది సినీ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన విషయం తెలిసిందే. అయితే వారందరూ తప్పకుండా కొత్త జీవోను వీలైనంత త్వరగా తీసుకువస్తే రాబోయే సినిమాలకి నష్టాలు రాకుండా ఉంటాయని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఆ విషయాన్ని చర్చల వరకే హైలెట్ చేయడం జరిగింది. భీమ్లా నాయక్ సినిమాకు కొత్త టికెట్ల రేట్లు అందుబాటులోకి వస్తాయని అనుకుంటే అప్పుడు కూడా ఏపీ సర్కారు ఏమాత్రం కొత్త రేట్లను అందుబాటులోకి తీసుకు రాకుండా అడ్డుపడింది. అంతేకాకుండా సినిమాకు ఎక్కడ ఎక్కువ రేట్లకు టికెట్ల అమ్ముతారో అని కఠిన కఠిన ఆంక్షల నడుమ థియేటర్స్ వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

    AP New G.O for Ticket Rates expected to come on March 7th

    అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవోను మార్చి 7వ తేదీన ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సినిమాలు అన్నిటికీ దాదాపు ఒకే తరహా టికెట్ల రేట్లను అందుబాటులోకి తీసుకు వస్తారు అని తెలుస్తోంది. ఇక అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా ప్రజలకు కూడా తక్కువ ఖర్చులో వినోదం అందుబాటులో ఉండేలా జగన్ ప్రభుత్వం ఆలోచనలోకి వచ్చే చాన్స్ ఉందట. ఇక ఫైనల్ గా మార్చి ఏడో తేదీన ఏదో ఒక విషయాన్ని ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కొత్త జీవోలో సినిమాల టికెట్ల రేట్లు ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది

    ప్రస్తుతానికి అయితే చాలా వరకు ఏసీ థియేటర్ లలో కూడా పది రూపాయల టికెట్లు 20 రూపాయల టికెట్లు ఉండడంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీ స్థాయిలో నష్టపోయే విధంగా సినిమాల బిజినెస్ లు కొనసాగుతున్నాయి. ఒక విధంగా ఆ రేట్లకు సినిమాల థియేటర్లను నడిపించే సాహసం చేయలేక చాలామంది థియేటర్లను క్లోజ్ చేసుకున్నారు కూడా. ఇటీవల భీమ్లా నాయక్ సినిమాపై అయితే ఆ ప్రభావం గట్టిగానే పడినట్లు అర్థమైంది. అంతకు ముందు విడుదలైన పుష్ప సినిమాకు కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా నష్టాలు వచ్చాయి. ఇక చేసేదేమి లేక నిర్మాతలే డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను పూరించే విధంగా కొంత డబ్బును కూడా వెనక్కి తిరిగి ఇచ్చారు.

    English summary
    AP New G.O for Ticket Rates expected to come on March 7th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X