‘జంజీర్’:ఆ సీన్ తెలుగు వెర్షన్ లో తొలిగించారా
హైదరాబాద్ : రామ్‌చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్'ఈ నెల 6 వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రంలో దర్శకుడు అపూర్వ లఖియా గెస్ట్ గా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అయితే తెలుగు వెర్షన్ లో ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఇక్కడ ఆ దర్శకుడు పెద్దగా ఎవరికీ తెలియకపోవటంతో తొలిగించారని చెప్పుకుంటున్నారు. హిందీ వెర్షన్ లో కొద్ది క్షణాలు పాటు కనిపించి అలరిస్తాడని తెలుస్తోంది.
రామ్ చరణ్ చిత్రానికి నైజాం వరకూ హ్యాపీనే కానీ, ఆంధ్రా, సీడెడ్‌ల్లో తమ సినిమాలను విడుదల చేయనిస్తారా లేదా అనే డైలమా ఉంది. అయితే రిలీజ్ తేదీలో మార్పేమీ లేదని సమాచారం. నిర్మాతలు ఎట్టిపరిస్ధితులోలనూ మొదట అనుకున్న తేదీకే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.
ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్‌రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ కలిసి నటించిన 'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి అక్కడ కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications












