రెహమాన్‌కు విడాకులు ఇష్టం లేదా? లాస్ట్ మినిట్‌లో ఏం జరిగింది?
ఇండియన్ సినిమా మ్యూజికల్ హిస్టరీ దగ్గర ఒక చెరగని ముద్ర వేసుకున్న అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో ఏ ఆర్ రెహమాన్ అనే పేరుని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటికే తన సంగీతంతో మంత్రముగ్దుల్ని చేస్తున్న ఇళయరాజా లాంటి సంగీత దర్శకుడు ఉన్న సమయంలోనే ఇంకొంచెం రిఫ్రెషింగ్ ట్యూన్స్ అందిస్తూ రెహమాన్ ఇచ్చిన ట్రీట్ కి పాన్ ఇండియా ఆడియెన్స్ అప్పట్లోనే తన పాటలు భాషతో సంబంధం లేకుండా పాడుకున్నారు.
ఇలా ఇండియన్ సినిమా దగ్గర ఒక హిస్టరీ సెట్ చేసుకున్న ఏ ఆర్ రెహమాన్ ఆస్కార్ గెలిచిన భారతీయుడిగా కూడా ఒక యూనిక్ రికార్డుని అందుకున్నారు. అయితే ఇప్పటికీ కూడా పలు భారీ సినిమాలు చేస్తుండగా తన సైడ్ నుంచి ఒక ఊహించని వార్త.. బహుశా తన అభిమానులు కలలో కూడా అనుకోని వార్తని వినాల్సి వచ్చింది.

తాను తన భార్య నుంచి విడాకులు ద్వారా విడిపోయినట్టుగా ఒక షాకింగ్ అనౌన్సమెంట్ ని అందించడం ఇండియన్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా తన సతీమణి సైరా బానుతో సుమారు 29 ఏళ్ళు దాంపత్య జీవితాన్ని రెహమాన్ ఎంతో అన్యోన్యంగా గడిపారు. మరి ఇన్నేళ్ళలో కూడా ఒక్కసారిగా వారి వైవాహిక బంధానికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ వార్తలు కూడా రాలేదు.
కానీ రెహమాన్ నుంచి ఊహించని విధంగా ఈ రకం వార్త వినాల్సి వస్తుంది అని ఎవరూ అనుకోలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కొంచెం విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని కంటే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇంకొకటి వచ్చింది అని చెప్పాలి. కాగా తన విడాకుల విషయంలో రెహమాన్ చాలా పెయిన్ తో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది.
"మేము ఇద్దరం గ్రాండ్ గా మా 30 ఏళ్ల దాంపత్య జీవితాన్ని గడుపుతాము అని అనుకున్నాను కానీ దానికి ఒక విషాద ముగింపే మిగిలింది. ముక్కలైన హృదయాల బరువుకి ఆ భగవంతుని సింహాసనం అయినా కూడా వణికి తీరుతుంది. కానీ ఆ పగిలిన హృదయం ముక్కలు మళ్ళీ అతుక్కోవడం జరగని పని. ఈ కష్ట కాలంలో నాతో ఉన్న నా స్నేహితులకి శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ రెహమాన్ గుండెల్ని పిండేసే షాకింగ్ పోస్ట్ ని చేశారు.
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
దీనితో ఈ పోస్ట్ చూసిన అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు. మరి రెహమాన్ నుంచి ఈ మెసేజ్ చూసిన తర్వాత ఈ విడాకులు తనకి అంత ఇష్టం లేకుండానే జరిగినట్టుగా అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది రెహమాన్ దంపతులకే తెలియాలి. ఇక ఇదిలాఉండగా రెహమాన్ కి ఓ కూతురు ఉండగా ఆమె కూడా సినిమాల్లోనే సంగీత దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళ్ లోనే ఓ సినిమాకి ఆమె సంగీతం అందిస్తుంది.


Click it and Unblock the Notifications











