Remuneration: రాంచరణ్ మూవీ కోసం రెహమాన్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఆ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ పరితోషికమా?

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి డిమాండ్ ఉన్నటువంటి తెలుగు హీరోలు బాగా పెరుగుతూ వెళుతున్నారు. అంతే కాకుండా పాన్ ఇండియా మార్కెట్ ని ఇంపాక్ట్ చేయగలిగే దర్శకులూ మన తెలుగు నుంచి చాలా మందే కనిపిస్తున్నారు. ఇలా మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి అలాంటి క్రేజీ హీరో అండ్ దర్శకుడు కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే యువ దర్శకుడు బుచ్చిబాబు సానా ల కాంబినేషన్ అని చెప్పవచ్చు.

కాగా బుచ్చిబాబు చేసింది ఒక్కటే సినిమా అయినప్పటికీ తన మొదటి సినిమాకే విజయ్ సేతుపతి లాంటి హీరోని ఒక తండ్రి పాత్రకి ఒప్పించగలిగాడు. కట్ చేస్తే రెండో సినిమాకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఛాన్స్ కొట్టడమే కాకుండా పాన్ ఇండియా నటీనటులు టెక్నీషియన్స్ ని కూడా పట్టాడు.

ar rahman remuneration is higher than janhvi Kapoor for rc 16

కాగా ఇలా కన్నడ నుంచి శివ రాజ్ కుమార్ ని తీసుకోగా హిందీ నుంచి హాట్ బ్యూటీ జాన్వీ కపూర్, లెజెండ్ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ లాంటి వారిని ఈ ఒక్క సినిమా ఎక్స్ పీరియన్స్ దర్శకుడు ఒప్పించాడు. కాగా ఇపుడు ఈ ఇద్దరి విషయంలోనే ఓ క్రేజీ టాక్ సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

కాగా జాన్వీ కపూర్ కూడా తెలుగులో ఒక్క సినిమానే చేసినప్పటికీ రామ్ చరణ్ తో సినిమాకి ఏకంగా 5 నుంచి 6 కోట్లు తీసుకుంటుంది అని ఆ మధ్య పలు రూమర్స్ వచ్చాయి. కాగా ఇపుడు రెహమాన్ ఇంతకు మించి షాకిచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా రెహమాన్ జాన్వీ కపూర్ కంటే ఎక్కువ పారితోషికాన్ని అందుకుంటున్నారని తెలుస్తుంది.

ar rahman remuneration is higher than janhvi Kapoor for rc 16

కాగా జాన్వీ కపూర్ హైయెస్ట్ గా 6 కోట్లు అందుకుంటే ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి ఏకంగా 8 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. దీనితో హీరోయిన్ కంటే ఎక్కువే తన శాలరీ అని చెప్పవచ్చు. ఆల్రెడీ ఈ సినిమా కోసం రెహమాన్ పలు ట్యూన్స్ కూడా ఇచ్చేశారని చెప్పారు. మరి ఈ సాలిడ్ రా అండ్ రస్టిక్ డ్రామాకి రెహమాన్ మ్యూజిక్ వినాలని చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారు. కానీ అందుకు చాలా సమయం ఉంది.

కాగా ఇపుడు సినిమా షూటింగ్ శరవేగంగా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో ఈ టాప్ నటీనటులు, టెక్నీషియన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ సెన్సేషనల్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ లో ఫేమస్ రోల్ మున్నా భయ్యా నటుడు దివ్యెందు శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇలా అన్ని రకాలుగా బుచ్చిబాబు ఈ సినిమాని పకట్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. మరి లేటెస్ట్ గా వచ్చిన భారీ సినిమా గేమ్ ఛేంజర్ కి గట్టి నెగిటివ్ మూలాన తీవ్రంగా దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. మరి బుచ్చిబాబు అయినా రామ్ చరణ్ కి మంచి కం బ్యాక్ ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: ram charan rc16 ar rahman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X