పులి ఆలస్యానికి కారణం పవన్ కాదు..మరి
పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వస్తున్న పులి చిత్రం ఎప్పుడొస్తుందా అని అంతటా ఎదురు చూపులు ఉన్నాయి. అయితే ఇంకా లేటయ్యేటట్లు ఉందని సమాచారం. దాంతో జల్సా రిలీజై ఏడాదిన్నర పైగా ఆవుతున్నా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ కాకపోవటంతో అభిమానులు అలక వహిస్తున్నారు. దాంతో పులి ఆలస్యానికి కారణం పవన్ కాదని, అతను రాజకీయాల్లో తిరగటం అసలు రీజన్ కాదని, ఎ.ఆర్.రహమాన్ సంగీతం లేటవటమే కారణమని చెప్తున్నారు. అసలే కాస్త లేటుగా వర్క్ ఫినిష్ చేసే రహమాన్ ఆస్కార్ అనంతరం విపరీతమైన బిజీగా మారారు. దాంతో పులి చిత్రానికి రెండు ట్యూన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం పెండింగ్ ఉంది. ఈ నేపధ్యంలో రహమాన్ చేతిలోనే పులి రిలీజ్ డేట్ ఉందంటున్నారు. అయినా కాస్త లేటయినా పవన్ ఎప్పుడూ లేటెస్ట్ గా వస్తాడు కాబట్టి హ్యాపీనే...మరో ఖుషి రేంజ్ హిట్ ని ఆశిద్దాం.
పవన్ కళ్యాణ్ పులి ఎఆర్ రహమాన్ ఎస్ జె సూర్య ఖుషి శింగనమల రమేష్ పోలీస్ ఆఫీసర్ pawan kalyan puli rehaman sj surya khushi singnamala ramesh jalsa


Click it and Unblock the Notifications