నిర్మాత అవతారం ఎత్తబోతున్న ఏఆర్ రెహమాన్

తాజాగా బాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రెహమాన్ త్వరలో ఓ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్‌తో సంయుక్తంగా ఆయన సినిమాను నిర్మించబోతున్నారట. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని అంటున్నారు.
గతంలోనూ రెహమాన్ విషయంలో అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఆయన దర్శకుడిగా అడుగు పెట్టబోతున్నారంటూ ఆ మధ్య సినీ వర్గాల్లో చర్చ సాగింది. అయితే ఆ విషయం ఇప్పటికీ నిజం కాలేదు. తాజాగా రెహమాన్ నిర్మాతగా మారుతున్నారంటూ వార్తలు మొదలయ్యాయి. మరి ఇందులో నిజమెంతో చూడాలి.
ఈ విషయాలను పక్కన పెడితే....సంగీత ప్రపంచంలో తదనైన ముద్ర వేస్తూ ముందుక సాగుతున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్స్‌కు తగిన విధంగా మ్యూజిక్ విభాగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇనిస్టిట్యూట్స్ ప్రారంభించారు. ఇటీవల ముంబైలో ముఖేష్ అంబానీ చేతుల మీదుగా రెహమాన్ మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ ప్రారంభమైంది.


Click it and Unblock the Notifications











