‘అరవింద సమేత’... షూట్ చేసే టైమ్ లేక ఏకంగా లేపేశారట!

Recommended Video

Aravinda Sametha Movie Had A Change

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరరెక్కిన 'అరవింద సమేత' అక్టోబర్ 11న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉండబోతున్నాయని, ఐదో పాట రీరికార్డింగ్ అయిపోయినా... సినిమా నుండి లేపేసినట్లు తాజాగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఆడియో ఆల్బం కూడా నాలుగు పాటలతోనే విడుదల చేశారు. ఆడియో ఆల్బంలో పాట పెట్టి సినిమాలో పెట్టక పోతే ఆ విషయంలో రచ్చ జరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

ముందు ఐదు పాటలు ప్లాన్ చేసుకున్న త్రివిక్రమ్

ముందు ఐదు పాటలు ప్లాన్ చేసుకున్న త్రివిక్రమ్

త్రివిక్రమ్ మొత్తం 5 పాటలతో కలిసి స్క్రిప్టు సిద్ధం చేశారు. అందులో మూడు పాటలు ఎన్టీఆర్ డాన్స్ చేసే విధంగా, మరో రెండు సిచ్యువేషన్ సాంగ్స్. అనగనగనగా, రెడ్డి ఇక్కడ చూడు అనే పాటలతో పాటు మరో పాట వెస్ట్రన్ బీట్‌తో తమన్ రీ రికార్డింగ్ కూడా చేశారట. ఇక పెనివిటీ, యేడపోయినాడో సాంగ్స్ సిచ్యువేషన్ సాంగ్స్.

 ఐదో పాట ఎందుకు లేపేశారు?

ఐదో పాట ఎందుకు లేపేశారు?

అరవింద సమేత షూటింగ్ మొదలవ్వడమే కాస్త ఆలస్యంగా మొదలైంది. దీంతో షెడ్యూల్స్ అన్నీ లేటవుతూ వచ్చాయి. మధ్యలో జరిగిన కొన్ని విషాద సంఘటనలు కూడా షూటింగుపై ప్రభావం పడ్డాయి. ఓ వైపు సినిమా దసరా రిలీజ్ ఫిక్స్ చేశారు. శర వేగంగా షూటింగ్ జరుపుతూ మొత్తానికి షూటింగ్ అంతా కంప్లీట్ చేసినా ఓ డాన్స్ సాంగ్ మాత్రం పెండింగులో ఉండిపోయింది. దాన్ని షూట్ చేసే సమయం కూడా లేక పోవడంతో సినిమా నుండి దాన్ని తీసేయాలని నిర్ణయించారట.

దాని వల్ల నష్టం లేదని భావించిన త్రివిక్రమ్

దాని వల్ల నష్టం లేదని భావించిన త్రివిక్రమ్

ఐదో పాట కేవలం ఎన్టీఆర్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేసిందే. ఆ పాట సినిమాలో లేక పోయినా సినిమాపై ఎలాంటి ప్రభావం పడదనే నిర్ణయానికి వచ్చిన త్రివిక్రమ్ ఆ పాట లేకుండానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని నిర్ణయించుకున్నారు.

అరవింద సమేత

అరవింద సమేత

అరవింద సమేత అక్టోబర్ 11న దసరా సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాపుతో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే ది బెస్ట్ అనేలా ఉండబోతోందని, ఎన్టీఆర్ యాక్షన్, త్రివిక్రమ్ డైలాగ్స్, టేకింగ్ సినిమాను మరో లెవల్‌కి తీసుకుపోవడం ఖాయం అంటున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. నాగ బాబు, సునీల్, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X