హీరో నుండి మళ్లీ సాధారణ స్థాయికి సునీల్.... రెమ్యూనరేషన్ ఎంతంటే?

By Bojja Kumar

Recommended Video

Sunil Shocking Remuneration For Aravindha Sametha

ఒకప్పుడు తెలుగులో స్టార్ కమెడియన్‌‌గా వెలుగొందాడు సునీల్. వరుస అవకాశాలతో తీరికలేకుండా వందల సినిమాల్లో నటించిన సునీల్ తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ కమెడియన్‌గా మారిపోయాడు. అయితే ఎప్పుడూ అలాంటి పాత్రలే చేయడం బోర్ కొట్టేయడంతో నెక్ట్స్ లెవల్‌కి వెళ్లడంలో భాగంగా హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టడం, తొలుత అతడు హీరోగా నటించిన కొన్ని సినిమాలు హిట్ అవ్వడంతో కమెడియన్ వేషాలు మానేసి పూర్తి స్థాయి హీరోగా కంటిన్యూ అయిన సంగతి తెలిసిందే. అయితే వరుస ప్లాపులతో నిర్ణయం మార్చుకున్న సునీల్ మళ్లీ సాధారణ పాత్రలు చేయడానికి సిద్ధమయ్యాడు.

హీరోగా సునీల్ రెమ్యూనరేషన్ ఎంత?

హీరోగా సునీల్ రెమ్యూనరేషన్ ఎంత?

సునీల్ హీరోగా సినిమాలు చేసినపుడు ఒక్కో సినిమాకు దాదాపు రూ. 3 కోట్ల వరకు తీసుకున్నట్లు టాక్. హీరోగా ఎదగడానికి చాలా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీ సైతం పెంచాడు. అయితే అదృష్టం కలిసిరాక పోవడంతో అతడి ప్రయాణం సాఫీగా సాగలేదని చెప్పక తప్పదు.

 సాధారణ పాత్రలు చేస్తున్న సునీల్

సాధారణ పాత్రలు చేస్తున్న సునీల్

సునీల్ ఇపుడు హీరోగా కాకుండా సైడ్ హీరోగా, హీరో తర్వాత కీలకంగా ఉండే పాత్రలు చేయడానికి సిద్ధమయ్యాడు. అల్లరి నరేష్‌తో కలిసి ‘సిల్లీ ఫెలోస్' అనే సినిమా చేయడంతో పాటు... జూ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత వీర రాఘవ'లో కమెడియన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

 ‘అరవింద సమేత'కు సునీల్ రెమ్యూనరేషన్ ఎంత?

‘అరవింద సమేత'కు సునీల్ రెమ్యూనరేషన్ ఎంత?

తన స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సినిమా కావడంతో `అర‌వింద స‌మేత‌` ద్వారా క‌మెడియ‌న్‌గా రీ-ఎంట్రీ ఇవ్వ‌డానికి ఒప్పుకున్నాడట. ఇందులో సునీల్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడ‌ు. ఈ సినిమాలో న‌టించినందుకు దాదాపు రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.

మళ్లీ సునీల్ కెరీర్ టర్న్ కాబోతోందా?

మళ్లీ సునీల్ కెరీర్ టర్న్ కాబోతోందా?

‘అరవింద సమేత'తో పాటు ర‌వితేజ న‌టిస్తున్న `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని` సినిమాలో కూడా సునీల్ నవ్వులు పండించబోతున్నాడు. రెండు సినిమాల్లో సునీల్ పాత్ర ద్వారా బాగా నవ్వులు పేలితే అతడి కెరీర్ మరో మలుపు తీసుకోవడం ఖాయం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X