సెప్టెంబర్ నాటికి అరవింద సమేత షూటింగ్ ఫినిష్.. విడుదల అప్పుడే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.ఎన్టీఆర్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించనుండడం విశేషం.
ఈ చిత్ర షూటింగ్ నిరంతరాయంగా సాగుతోంది. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ షూటింగ్ శరవేగంగా జరుపుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తైపోతుందట. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు త్వరగా ఫినిష్ చేసి అక్టోబర్ లో సినిమాని విడుదుల చేయాలని భావిస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు టీజర్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు తండ్రిగా నటిస్తున్నాడు. ఇటీవల లీకైన ఎన్టీఆర్, నాగబాబు స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని రాధాకృష్ణ హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్ళు చెదిరే యాక్షన్ అంశాలు, ఆకట్టుకునే కుటుంబ సన్నివేశాలు ఉండబోతున్నాయట.


Click it and Unblock the Notifications











