మహేష్ ఖలేజా చిత్రంలో ఆమెకి అంత సీన్ లేదా
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అయిన ఖలేజా చిత్రంలో అర్చన అలియాస్ వేద చేస్తోంది. ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోయిన ఆమె ఈ చిత్రం గురించి బయిట కొంచెం ఎక్కువగానే పబ్లిసిటీ ఇచ్చుకుంటోంది. అయితే అంతర్గత వర్గాల ద్వారా తెలిసే విషయం మాత్రం ఆమెకు ఆ సినిమాలో అంత సీన్ లేదని. జల్సా చిత్రంలో కమిలినీ ముఖర్జీకి క్యారెక్టర్ లాగానే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్ర అని చెప్పుకుంటున్నారు. అనూష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. మణిశర్మ అందించిన పాటలు త్వరలోనే విడుదల చేస్తారు. ఈనెల 18 నుంచి బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల్ని తెరకెక్కించి సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత శింగనమల రమేష్ చెప్తున్నారు


Click it and Unblock the Notifications











