Anupama Parameswaran : పబ్లిక్‌లో బాయ్‌ఫ్రెండ్‌కు లిప్‌లాక్ .. ఫోటోలతో దొరికిపోయిన టిల్లూ హీరోయిన్
ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్స్‌తో టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో ఒక్కో జంట ఒక్కో బాంబు పేలుస్తోంది. ఎప్పుడు ఎవరు పెళ్లి పీటలెక్కుతారో? ఎవరు విడిపోతారో? తెలియక సినీ ఇండస్ట్రీ, అభిమానులు టెన్షన్ పడుతున్నారు. నటీనటుల మధ్య గుట్టుగా సాగుతున్న ఎఫైర్స్ ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ ప్రేమాయణం బయటపడింది. ఈ వివరాల్లోకి వెళితే..
నటిగా మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన అ ఆ చిత్రంతో తెలుగువారిని పలకరించింది. లంగా ఓణీలో పదహారు అణాల తెలుగు అమ్మాయిలా ఆ సినిమాలో నటించి కుర్రాళ్లకు సెగలు రేపింది. ఆ తర్వాత ప్రేమమ్, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హాలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు తదితర చిత్రాల్లో నటించింది. కొన్నాళ్లు తెలుగు తెరకు దూరమైన అనుపమ...కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో బిజీ అయ్యింది.

2022లో రౌడీ బాయ్స్‌తో తిరిగి టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసింది. అంటే సుదరానికీ, కార్తీకేయ 2, 18 పేజీస్, బటర్ ఫ్లై, ఈగల్, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో దుమ్మురేపింది. కెరీర్‌లో తొలుత పద్ధతిగానే కనిపించిన అనుపమ.. ఇటీవల మాత్రం రెచ్చిపోతోంది. అవసరమైతే రొమాంటిక్ సీన్స్‌కు కూడా రెడీ అని తేల్చేసింది. పలు చిత్రాల్లో ఘాటు లిప్‌లాక్స్‌తో సెగలు రేపింది. ఈ ఏడాది సిరెన్, డ్రాగన్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు అనపమ.
ప్రస్తుతం తమిళ్‌లో బిసన్, లాక్‌డౌన్.. తెలుగులో పరదా.. మలయాళంలో పెట్ డిటెక్టివ్, జేఎస్‌కే ట్రూత్ షాల్ అనాలిసిస్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేయనప్పటికీ .. యువతలో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. కెమెరా ముందు పది పేజీల డైలాగ్స్ చెప్పమన్నా చెబుతానని.. కానీ ఫోటో షూట్స్, ఇంటర్వ్యూల కోసం కెమెరా ముందుకు వెళ్తే చెమటలు పడతాయని అనుపమ పరమేశ్వరన్ వెల్లడించారు.
కాగా అనుపమ పరమేశ్వరన్ ప్రేమ, పెళ్లి గురించి గతంలో పలుమార్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆమె ప్రేమాయణానికి సంబంధించిన న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌తో అనుపమ ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్‌కు సంబంధించి ఓ ఫోటో కూడా లీకైంది. ఇందులో అనుపమ, విక్రమ్‌లు ఘాటు లిప్‌లాక్‌లో అతుక్కుపోయి కనిపిస్తున్నారు.
దీంతో వీరిద్దరి ప్రేమాయణం నిజమేనంటూ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అనుపమ, ధ్రువ్‌లు ప్రస్తుతం బైసన్ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో .. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే నిజంగానే ధ్రువ్ - అనుపమలు ప్రేమలో పడ్డారా? లేక వీరి లిప్‌లాక్ ఫోటో ఆ సినిమాలోనిదా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఒక్క ఫోటోతో సౌతిండియన్ ఇండస్ట్రీని షేక్ చేశారు అనుపమ.


Click it and Unblock the Notifications











