చరణ్ హీరోయిన్‌కి పెళ్లయిందా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' అనే చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే. 'మదరాసు పట్టణం' అనే తమిళ చిత్రం ద్వారా భారతీయ వెండి తెరకు పరిచయమైన బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ 'ఎవడు' చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా అమీ జాక్సన్‌కు సంబంధించిన ఓ వార్త మీడియాలో చర్చనీయాంశం అయింది. గౌతమ్ మీనన్ రూపొందించిన హిందీ చిత్రం 'ఏక్ దివానా థా'లో బాలీవుడ్ నటుడు ప్రతిక్ బబ్బర్‌తో కలిసి నటించిన ఈ భామ అతనిడితో ప్రేమాయణం నడుపుతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ఇద్దరికి పెళ్లి కూడా జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, తమ వివాహాన్ని రిజిస్టర్ కూడా చేయించుకున్నారని అంటున్నారు. త్వరలో ఈ భామ చెర్రీ సరసన నటిస్తుండటంతో ఇటు మెగా అభిమానులు కూడా ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే ఈ పెళ్లి వార్తల వెనక మరో ప్రచారం కూడా ఉంది. ప్రతిక్-అమీ నటించిన 'ఏక్ దివానా థా' చిత్రం ప్లాప్ కావడంతో....పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలాంటి రూమర్లను తెరపైకి తెస్తున్నారని, ఎఫైర్లతో ప్రచారం పెంచుకుని సినిమాల అవకాశాలు దక్కించుకోవడం బాలీవుడ్లో ఎప్పటి నుంచో నడుస్తున్న ట్రెండ్. వారి బాటలోనే ప్రతిక్-అమీ నడుస్తున్నారంటున్నారు.


Click it and Unblock the Notifications











