త్రివిక్రమ్ అంటే నాగార్జునకు పడదా? ఇద్దరి మధ్య అందుకే చెడిందా?

'మన్మధుడు' పేరు వింటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కినేని నాగార్జున. 2002లో వచ్చిన ఈ చిత్రం ఎవర్ గ్రీన్ హిట్‌‌గా నిలిచింది. నాగార్జున అంటే క్రేజ్ మరింత పెరిగేలా చేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది కె విజయ భాస్కర్ అయినప్పటికీ.... ఎక్కువ క్రెడిట్ దక్కింది మాత్రం ఈ చిత్రానికి కథ, మాటలు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కే... ఒకప్పటి ఈ టాప్ రచయిత ఇపుడు దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ప్రస్తుతం నాగార్జున 'మన్మధుడు 2' సినిమా చేస్తున్నాడు. ఆగస్టు 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్లలో ఎక్కడా కూడా నాగార్జున... త్రివిక్రమ్ ప్రస్తావన తేవడం లేదు. త్రివిక్రమ్ గురించి మాట్లాడటానికి కూడా ఆయన ఇష్ట పడటం లేదనే ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ ప్రస్తావన రాగానే దాట వేసిన నాగార్జున

త్రివిక్రమ్ ప్రస్తావన రాగానే దాట వేసిన నాగార్జున

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘త్రివిక్రమ్ గురించి ఎందుకు మాట్లాడలేదు?' అని యాంకర్ వేసిన ప్రశ్నకు ''నాకు మన్మథుడు కథ చెప్పింది విజయ్ భాస్కర్ గారు. ఆయన రోజూ నన్ను కలిసి కథ గురించి చర్చించేవారు. అందులోని పంచ్ డైలాగులు చెప్పింది కూడా ఆయనే. అందుకే ఆయన గురించే మాట్లాడాను.. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్'' అంటూ నాగార్జున వ్యాఖ్యానించడంతో నాగార్జున-త్రివిక్రమ్ మధ్య ఏదో ఇష్యూ జరిగిందనే వాదనకు మరింత బలం చేకూరినట్లయింది.

ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవా?

ఇద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవా?

ఫిల్మ్ నగర్లో ఈ విషయమై రకరకాలుగా చర్చసాగుతోంది. నాగార్జున, త్రివిక్రమ్ మధ్య సంబంధాలు చెడిపోయాయని, అందుకే నాగ్ ప్రవర్తన అలా ఉందని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. విషయం ఏమిటా? అని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇద్దరి మధ్య అందుకే చెడిందట!

ఇద్దరి మధ్య అందుకే చెడిందట!

తన చిన్న కుమారుడు అఖిల్ నటించిన సినిమాలు వరుసగా బోల్తాపడటంతో.... త్రివిక్రమ్‌ను నాగార్జున సంప్రదించారని, అఖిల్ హీరోగా సినిమా చేయాలని అడిగినట్లు సమాచారం. ఇందుకోసం భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. అయితే నాగార్జున ఇచ్చిన ఆఫర్‌ను ఒప్పుకోవడం కానీ, తిరస్కరించడం కానీ చేయకుండా మౌనంగా ఉంటూ అసలు పట్టించుకోవడమే మానేశాడట. త్రివిక్రమ్ తీరుతో విసిగిపోయిన నాగార్జునకు మాటల మాంత్రికుడిపై ఓపీనియన్ పూర్తిగా మారిపోయిందని, అప్పటి నుంచి వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు టాక్.

మన్మధుడు 2

మన్మధుడు 2

నాగార్జున అక్కినేని, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా నటించిన ఈ చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వం వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X