SSMB28: మహేశ్ సినిమాలో యంగ్ లయన్.. మరోసారి పవర్ చూపిస్తాడా!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌లోనే తాను నటించబోయే ఫ్యూచర్ ప్రాజెక్టులకు కూడా లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పుడు ఈ హ్యాండ్సమ్ హీరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మూడోసారి జతకట్టి సినిమా చేస్తున్నాడు. 'అతడు', 'ఖలేజా' వంటి క్రేజీ మూవీల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తోన్న సినిమా రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితం ప్రారంభమైంది. ఆ వెంటనే దీనికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల షూటింగ్ సజావుగా సాగలేదు. ఇక, ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను మొదలు పెట్టారు. దీన్ని శరవేగంగా జరుపుతూ వస్తున్నారు. అంతేకాదు, త్రివిక్రమ్ సినిమాను ఏమాత్రం బ్రేకులు లేకుండా పూర్తి చేయాలని మహేశ్ బాబు ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

ఇద్దరు స్టార్ల కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్లు భాగం కాబోతున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఎంతో మంది వేరే ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్ర కోసం కోలీవుడ్ కుర్రాడు, 'మాస్టర్' ఫేం అర్జున్ దాస్‌ను తీసుకుంటున్నారని తెలిసింది. తనదైన స్వరంతో లయన్‌గా పేరు తెచ్చుకున్న అతడు.. మహేశ్‌ను ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నాడని అంటున్నారు. దీంతో ఇందులో అతడి పాత్రపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











