twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa The Rule: పుష్ప 2లో బాలీవుడ్ స్టార్ హీరో.. ఆ పవర్‌ఫుల్ రోల్‌ కోసమే

    |

    క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపకల్పనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూడో చిత్రమే 'పుష్ప: ద రైజ్'. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. దీనికి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే స్పందన రావడంతో పాటు కలెక్షన్లు కూడా పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా 'పుష్ప' హిందీలో వంద కోట్ల వసూళ్లను కూడా రాబట్టి సత్తా చాటింది. దీంతో ఈ సినిమా రెండో భాగంపై అందరిలోనూ అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

    డ్రెస్ సైజ్ తగ్గించిన దీప్తి సునైనా: పైనా కిందా పరువాల ప్రదర్శనడ్రెస్ సైజ్ తగ్గించిన దీప్తి సునైనా: పైనా కిందా పరువాల ప్రదర్శన

    మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో 'పుష్ప ద రూల్' కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ మొదలు కాకుండానే ఈ మూవీ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో ఫలానా స్టార్ హీరో కీలక పాత్రను పోషిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.

     Arjun Kapoor Key Role in Pushpa The Rule

    'పుష్ప ద రూల్' మూవీలో మరో బాలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అతనెవరో కాదు.. హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోగా ఎదిగిపోయిన అర్జున్ కపూర్. అవును.. ఈ బాలీవుడ్ హీరోనే తాజాగా సుకుమార్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో ముంబైకి చెందిన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా డిజైన్ చేశారట. దీనికోసమే అర్జున్ కపూర్‌తో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతుందనే టాక్ వినిపిస్తోంది. అయితే, దీనికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? లేదా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

    బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

    అల్లు అర్జున్‌ - సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

    English summary
    Icon Star Allu Arjun will do Pushpa 2 Under Creative Director Sukumar Direction. Arjun Kapoor to do Key Role in This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X