నో సీక్రెట్స్... ఆ ఇద్దరి విషయంలో అందరూ ఊహించిందనే జరుగబోతోందా?

Recommended Video

Arjun Kapoor And Malaika Arora Spotted In Same Car

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కుటుంబంలో కొన్ని నెలల క్రితం అతడి సోదరుడు అర్బాజన్ ఖాన్ విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అర్భాజ్ ఖాన్‌తో మలైకా అరోరా విడిపోవడంతో అంతా షాకయ్యారు. ప్రేమ వివాహం చేసుకున్న వీరు విడిపోతారని ఎవరూ ఊహించలేదు. అంతలోనే మరో షాకింగ్ న్యూస్...బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్‌కు ఆమె దగ్గరవ్వడమే ఇందుకు కారణమనే పుకార్లు షికార్లు చేశాయి. అర్దరాత్రి పూట అర్జున్ కపూర్ మలైకా ఇంటికి వెళ్లడం కూడా ఇద్దరి మధ్య 'సం'బంధం ఉందనే వార్తలకు బలం చేకూరింది. ఆ సమయంలో అర్జున్ కపూర్‌కు సల్మాన్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరిగింది.

ఇంతకాలం రహస్యంగానే

ఇంతకాలం రహస్యంగానే

భర్త అర్బాజ్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరా, అర్జున్ కపూర్ రహస్యంగా ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు చాలా కాలంగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎక్కడా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారని టాక్.

రహస్య కలాపాలకు చెక్

రహస్య కలాపాలకు చెక్

అయితే తమ రహస్య ప్రేమ కలాపాలకు చెక్ పెట్టాలని, తమ రిలేషన్‌షిప్ స్టేటస్ అందరికీ తెలిసేలా చేయాలని ఇద్దరూ నిర్ణయిచుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి బాలీవుడ్ డిజైనర్ సందీప్ ఖోస్లా ఇచ్చిన పార్టీకి ఒకే కారులో రావడమే ఇందుకు నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అఫీషియల్‌ ప్రకటనకు నో...

అఫీషియల్‌ ప్రకటనకు నో...

అయితే తాము రిలేషన్‌షిప్ ఉన్నామనే విషయాన్ని ఈ ఇద్దరూ అఫీషియల్‌గా ఒప్పుకోవడం లేదు. అర్జున్ కపూర్ తనకు మంచి ఫ్రెండ్ అని, కానీ ప్రజలు ఈ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, మా మధ్య ఏదో సంబంధం ఉందనే దాంట్లో నిజం లేదు... అని మలైకా స్పష్టం చేశారు.

 అర్జున్ కపూర్

అర్జున్ కపూర్

అర్జున్ కపూర్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘నమస్తే ఇంగ్లండ్' అనే చిత్రంలో పరిణీతి చోప్రాతో కలిసి నటిస్తున్నాడు. విపుల్ అమృతల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X