హీరోతో దర్శకుడి గొడవ: రోజూ లక్ష ఖర్చు పెట్టి తాగి తందనాలాడితే...!

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా షూటింగుల సమయంలో దర్శకుడి దగ్గర నుండి ఆర్టిస్టుల వరకు అంతా క్రమశిక్షణతో పని చేస్తేనే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తవుతుంది. అలా కాకుండా షూటింగ్ గ్యాపులో తాగి తందనాలాడితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.

బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ తన తాజా సినిమా 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' షూటింగ్ సమయంలో ఇలానే చేయడంతో దర్శకుడితో పెద్ద గొడవే జరిగిందట. ఇటీవల ఢిల్లీలో షూటింగ్ జరుగుతుండగా రోజూ షూటింగ్ అయిపోగానే తన స్నేహితులతో కలిసి పార్టీలోలో మునిగిపోయేవాడట. రోజూ లక్ష ఖర్చు చేసి రాత్రంతా తాగి తందనాలాడటం... తాగిన మత్తు తలకెక్కి మర్నాడు ఉదయం వరకు దిగక పోవడంతో షూటింగులో చాలా డిస్ట్రబ్డ్‌గా ఉండే వాడట.

Arjun Kapoor's '1 LAKH A DAY' Party Bills angers Director Mohit Suri

దాంతో చిన్న చిన్న సన్నివేశాలకు రీటేకులు తీసుకుంటూ ఫొటోగ్రాఫర్‌పై విరుచుకుపడే వాడని వార్తలు వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇలానే ఉంటే షూటింగ్ లేటవుతుందని గ్రహించిన దర్శకుడు మోహిత్ సూరి అర్జున్ కపూర్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేసాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని టాక్.

విషయం అర్జున్ కపూర్ తండ్రి బోనీ కపూర్ వరకు వెళ్లిందని.... దీంతో ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుని అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని, ఇపుడు అర్జున్ కపూర్ షూటింగ్ సమయంలో బుద్దిగానే ఉంటున్నాడని అంటున్నారు.

హాఫ్ గర్ల ప్రెండ్ సినిమా విషయానికొస్తే... చేతన్ భగత్ రాసిన 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' నవల ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అర్జున్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ చిత్రం మే 19, 2017లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X