అర్జున్ రెడ్డి డైరెక్టర్.. బాక్సాఫీస్ హిట్ కొట్టినా ఓపిక పట్టాల్సిందేనా?
సాధారణంగా ఏ దర్శకుడైనా సరే మొదటి సినిమాతో హిట్టు కొట్టగానే వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తెచ్చేస్తాడు. వీలైతే రెండో సినిమా సెట్స్ పై ఉండగానే మూడో సినిమాకు కూడా సైన్ చేసేస్తారు. అయితే అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం చాలా ఆలస్యంగా అడుగులు వేస్తున్నాడు. అర్జున్ రెడ్డి కథను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
దీంతో బాలీవుడ్ లోనే రణ్ వీర్ సింగ్ తో సినిమా చేసే మంచి ఆఫర్ ను అందుకున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో కథను చెప్పి మెప్పించగా ఆ సినిమాను సమ్మర్ లోనే సెట్స్ పైకి తేవాలని కూడా ప్లాన్ వేసుకున్నారు. అయితే సడన్ గా కరోనా లాక్ డౌన్ రావడంతో ప్లాన్ మొత్తం చేంజ్ అయ్యింది. హీరో రణ్ వీర్ ప్రస్తుతం మరో రెండు సినిమాలను ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఆ రెండు పూర్తయితే గాని సందీప్ తో కలవలేని పరిస్థితి. ఇక మరో సినిమా మొదలు పెట్టాలి అంటే ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోలు ఎవరు కూడా ఖాళీగా లేరు.

అందుకే ఎటు తేల్చుకోలేక సందీప్ రణ్ వీర్ కోసం వెయిట్ చేయక తప్పడం లేదు. ఆ మధ్య మాఫియా కథను మొదట మహేష్ బాబుకు చెప్పినట్లు టాక్ వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమా చూసి దర్శకుడికి ఫ్యాన్ అయిన మహేష్ అతనితో సినిమా చేయడానికి బాగానే ఇంట్రెస్ట్ చూపించాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో కథను కూడా విన్నాడు. మరి ఆ కథ నచ్చిందో లేదో తెలియదు గాని కాంబో అయితే సెట్టవ్వలేదు. ఇక సందీప్ బాలీవుడ్ హీరోతోనే మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. మరి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలి అంటే మరో రెండు నెలలు ఓపిక పట్టాల్సిందే.


Click it and Unblock the Notifications











