మహేష్ 27వ చిత్రం అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో.. నిర్మాత ఎవరంటే!
అర్జున్ రెడ్డి చిత్రంలో యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. డెబ్యూ మూవీ తోనే సంచలన విజయం సాధించడంతో సందీప్ పేరు మారుమోగింది. ఎమోషనల్ లవ్ స్టోరీతో అందరిని మాయ చేశాడు. దీనితో సందీప్ రెడ్డితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం తరువాత నుంచి సందీప్ సూపర్ స్టార్ మహేష్ తో టచ్ లో ఉంటున్నాడు.
తాజగా వీరిద్దరి కాంబినేషన్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు ప్రతిష్టాత్మకమైన తన 25 వ చిత్రం మహర్షిలో నటిస్తున్నాడు. మహర్షి తరువాత మహేష్ సుకుమార్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అంటే మహేష్ 26 వ చిత్రం కూడా ఖరారైపోయింది. మహేష్ 27 వ చిత్రం గురించే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మహేష్ 27 వ చిత్రం త్రివిక్రమ్ దర్శత్వంలో అంటూ వార్తలు వస్తున్నాయి. కాదు రాజమౌళి దర్శకత్వంలో అని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవేవి నిజం కాదంటూ మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. మహేష్ 27 వ చిత్రానికి దర్శకుడు సందీప్ రెడ్డి అని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా ఆసక్తిని పెంచుతూ మరో ప్రచారం ఊపందుకుంది. సందీప్, మహేష్ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ గందరగోళం మొత్తం తొలిగిపోవాలనుంటే అధికారికంగా ప్రకటన రావాల్సిందే.


Click it and Unblock the Notifications











