అర్జున్ రెడ్డి సీక్వెల్ గురించి విజయ్ దేవరకొండ, 40 ఏళ్లలో అర్జున్ రెడ్డి!
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన షాలిని పండే మరియు ఇతర నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి విజయ్ దేవరకొండ స్పందించడం జరిగింది. అతను ఏమన్నాడో అతని మాటల్లో...
Recommended Video


సందీప్‌రెడి తో మహేష్ సినిమా..
గతేడాది తెలుగులో విడుదలై సంచలన విజయం సాధంచిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి. ఈ సినిమా విడుదల తరువాత విజయ్ దేవరకొండకు వరుస అవకాశాలు వచ్చాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ సినిమా తరువాత వరుస ఆఫర్స్ తో బిజీ అయ్యాడు. తాజాగా ఈ డైరెక్టర్ మహేష్ బాబు తో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా చెప్పాడు.

అర్జున్ రెడ్డి సీక్వెల్‌పై విజయ్ స్పందన..
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన షాలిని పండే మరియు ఇతర నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై విజయ్ దేవరకొండ స్పందించడం జరిగింది. అర్జున్ రెడ్డి సినిమాకు సీక్వెల్ చేయ్యబోతున్నట్లు చెప్పడం విశేషం.

40 ఏళ్ల అర్జున్‌రెడ్డి జీవితం గురించి
అర్జున్ రెడ్డి సినిమా సీక్వెల్ గురించి డైరెక్టర్ సందీప్, తాను చర్చించుకున్నామని, ఒకవేళ సీక్వెల్ తీస్తే అందులో 40 ఏళ్ల వయసులో అర్జున్ రెడ్డి జీవితం ఎలా ఉంటుంది అనేది చూపించాలని అనుకుంటున్నామని తెలిపాడు. కాకపొతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. అవి అన్ని పూర్తి అయ్యాక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు విజయ్ దేవరకొండ తెలిపాడు.

విజయ్ దేవరకొండ సరసన మెహ్రీన్
విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా టాక్సీవాలా సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాతో పాటు పరుశురం బుజ్జితో గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా దాదాపు షూటింగ్ పూర్తి అయ్యింది. తాజాగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నోటా అనే సినిమా చెయ్యబోతున్నాడు విజయ్. తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమా రూపొందుతోంది. మేహరిన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











