‘అర్జున్‌ రెడ్డి’ లవర్‌కు తగ్గిన అవకాశాలు.. అసలు కారణం ఇదేనట

విజయ్ దేవరకొండ సెన్సేషనల్ మూవీ 'అర్జున్‌ రెడ్డి' సినీ రంగ ప్రవేశం చేసింది శాలినీ పాండే. ఈ సినిమాలో బోల్డుగా కనిపించినప్పటికీ, తన నటనతోనూ ఆకట్టుకుంది. చక్కనైన హావభావాలతో సీన్లు పండించింది. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్టింగ్‌కు ఎన్నో ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా శాలినికి అవకాశాలే దక్కడం లేదు.

'అర్జున్‌ రెడ్డి' తర్వాత ఆమె మూడే సినిమాల్లో కనిపించింది. అందులో కల్యాణ్ రామ్ '118'లో పూర్తి స్థాయి పాత్ర చేయగా, 'మహానటి', ఎన్టీఆర్ బయోపిక్‌లో మాత్రం అతిథి పాత్రలకే పరిమితమైంది. ఇప్పటి వరకు చేసింది ఈ చిత్రాలే కావడంతో ఆమెకు అవకాశాలు దొరకడం లేదన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ బోల్డ్ బ్యూటీ పని అయిపోయినట్లేనన్న టాక్ ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

 Arjun Reddy Shalini Pandey is In Problems

అయితే, షాలినీ పాండేకు అవకాశాలు రావడం లేదన్నది వట్టి మాటే అని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ఆమె కాల్షీట్ల కోసం వస్తున్నారని అంటున్నారు. అవకాశాలు వచ్చినా ఆమె కొన్ని డిమాండ్లు పెట్టడం వల్ల అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని తెలుస్తోంది. సినిమాలో తన పాత్ర పరిధి ఎక్కువగా ఉండాలని, తక్కువగా ఉంటే చేయనని తెగేసి చెబుతుందట. దీంతో చాలా మంది దర్శకులు వెనక్కి వెళ్లిపోతున్నారని సమాచారం.

అలాగే, రెమ్యూనరేషన్ విషయంలోనూ కొన్ని పరిధులు పెట్టుకుందని, దానికి ఏమాత్రం తగ్గినా సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదన్న టాక్ కూడా ఉంది. ఈ కారణాలతోనే అవకాశాలు తగ్గిపోతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం షాలినీ పాండే రాజ్ తరుణ్‌ హీరోగా రూపొందుతున్న ఒక సినిమాలో నటిస్తోంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X