దేవరకొండ.. నిజంగా కిరాక్ అబ్బా!, మనోడి క్రేజ్ మామూలుగా లేదు.. అక్కడ కూడా?

ఏదో హిట్ కొట్టామా లేదా అన్నట్లు సాదాసీదా హిట్టు కొట్టడం వేరు.. కొడితే దిమ్మతిరిగేలా హిట్టు కొట్టడం వేరు.. విజయ్ దేవరకొండ ఈ రెండో కోవకు చెందినవాడు. చేసినవి రెండే సినిమాలైనా.. అర్జున్ రెడ్డితో ఒక్క తెలుగు మాత్రమే గాక తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లోను తన గురించి చర్చించుకునేలా చేశాడు.

Recommended Video

ప్రముఖ డైరెక్టర్ కు నో చెప్పిన అర్జున్ రెడ్డి !

అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ నటనకు ఇటు ఇండస్ట్రీ, అటు ఆడియెన్స్ అంతలా ఫిదా అయిపోయారు. తొలినుంచి చివరిదాకా అర్జున్ రెడ్డి పాత్రలో ఏమాత్రం తగ్గని తీవ్రత ప్రేక్షకులను అలా కట్టిపడేసింది. అప్పటిదాకా మూస క్యారెక్టరైజేషన్స్‌ను తెరపై చూసిన తెలుగు జనాలు.. ఆ పాత్రతో థ్రిల్ ఫీల్ అయ్యారు.

అర్జున్ రెడ్డితో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న విజయ్ దేవరకొండపై ఇప్పుడు పక్క ఇండస్ట్రీ వాళ్లూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ కథా కమామీషు ఏంటంటే..

 విజయ్‌తో ఆనంద్ శంకర్‌

విజయ్‌తో ఆనంద్ శంకర్‌

తమిళ సినీ ఇండస్ట్రీ అంటే ప్రయోగాలకు పెట్టింది పేరు. తెలుగుతో పోల్చితే వైవిధ్యమైన సినిమాలకు అక్కడ స్కోప్ ఎక్కువ. కథా, కథనాలతో పాటు నటన పరంగాను కొత్తగా చూపించడానికి వీలుండే సబ్జెక్ట్స్ వారు ఎంచుకుంటారు.

అర్జున్ రెడ్డిలో వైవిధ్యమైన నటన కనబర్చిన విజయ్ దేవరకొండపై ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ కన్ను పడింది. చియాన్ విక్రమ్ హీరోగా ఇరుముగన్(ఇంకొకడు) సినిమా తెరకెక్కించిన ఆనంద్ శంకర్, విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే విజయ్‌కి స్క్రిప్ట్ కూడా వినిపించారట.

విజయ్ తమిళ్ డెబ్యూ:

విజయ్ తమిళ్ డెబ్యూ:

ప్రస్తుతం పరుశురాం దర్శకత‍్వంలో తెరకెక్కుతున్న 'గీతాగోవిందం' సినిమాతో పాటు షికారు, మహానటి సినిమాలతో విజయ్ బిజీగా ఉన్నాడు. ఈ కమిట్ మెంట్స్ అన్ని పూర్తయ్యాకే ఆనంద్ శంకర్ సినిమా చేసే అవకాశం ఉంది.

కాబట్టి వచ్చే ఏడాది సమ్మర్‌లో ఆనంద్ శంకర్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను తెరకెక్కిస్తుండటంతో.. విజయ్‌కి ఇది తమిళ్ డెబ్యూ అయ్యే అవకాశముంది.

అక్కడా విజయ్ 'మార్క్' పడుతుందా?:

అక్కడా విజయ్ 'మార్క్' పడుతుందా?:

రెండో సినిమాకే విజయ్ దేవరకొండ పక్క ఇండస్ట్రీల నుంచి కూడా అవకాశాలను దక్కించుకుంటుండటం భవిష్యత్తులో అతని మార్కెట్ కు ఉపయోగపడనుంది. ఒకవేళ అక్కడ కూడా విజయ్ మంచి హిట్స్ సాధిస్తే.. కెరీర్ గ్రాఫ్ అమాంతం పెరగడం ఖాయం.

కోలీవుడ్ లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం.. లెజెండరీ డైరెక్టర్స్ మణిరత్నం, శంకర్‌ల కన్ను కూడా విజయ్ పై పడిందట. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో వారి సినిమాల్లో విజయ్ కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

 అర్జున్ రెడ్డి రీమేక్:

అర్జున్ రెడ్డి రీమేక్:

తెలుగులో బంపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా ప్రస్తుతం హిందీ, కన్నడ, తమిళంలోను రీమేక్ గా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హిందీ రీమేక్ లో రణవీర్ సింగ్ ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుండగా.. తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతోంది. ఇక కన్నడలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మాతగా యష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X