అల్లు అర్జున్ కోసం సీన్ లోకి యాక్షన్ కింగ్
హైదరాబాద్ : ఇప్పుడున్న పరిస్దితుల్లో కొత్త కథలు పుట్టవు..కొత్త కాంబినేషన్స్ పుడతాయి అని సినీ సీనియర్స్ చెప్తున్నట్లుగా విభిన్నమైన కాంబినేషన్స్ తో సినిమాలు సిద్దమవుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. అర్జున్ కి ప్రత్యేకమైన క్యారక్టరైజేషన్ తో నెగిటివ్ పాత్రను డిజైన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ హీరోగా, కీలకమైన క్యారెక్టర్ రోల్స్ చేసిన అర్జున్ తొలిసారిగా నెగిటివ్ పాత్రలో కనిపించటంతో సినిమాకు ప్రత్యేకమైన లుక్ వస్తుందని భావిస్తున్నారు.
రేసుగుర్రం హిట్‌తో మంచి జోష్ మీదున్న అల్లుఅర్జున్ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ కొత్త సినిమా ఆ మధ్యన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అందుకే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్‌లని ఫైనల్ చేశారని తెలిసింది. అత్తారింటికి దారేది సినిమాలో నటించిన సమంతా, ప్రణీతలను ఈ సినిమాకు త్రివిక్రమ్ కంటిన్యూ చేస్తున్నాడు.

మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతిసనన్‌ని మూడవ హీరోయిన్‌గా ఎంపిక చేశారట. జులాయి చిత్రాన్ని నిర్మించిన ఎస్.రాధాకృష్ణ హారిక అండ్గ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు. త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనుండగా అల్లు అరవింద్ ఈ చిత్రం నిర్మాణంలో భాగ స్వామిగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











