మహేష్‌తో పోరాడేందుకు హ్యాండ్సమ్ విలన్.. ఈ సారి ఆట ఎలా ఉంటుందో మరి!!
మహేష్ బాబు సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలో నటించే హీరోయిన్ దగ్గరి నుంచి ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్ వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది సినిమాకు కీలకంగా ఉండే ప్రతినాయకుడి పాత్రకు ఎంతటి ప్రాధాన్యతనిస్తారో, ఆ పాత్రను చేసేవారి గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ తెలిసిందే. అసలే వరుస సక్సెస్‌ల మీదున్న మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్‌పై మరింత శ్రద్ద చూపిస్తున్నట్టు సమాచారం.

ప్రత్యేకంగా 27వ ప్రాజెక్ట్
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లాంటి భారీ సక్సెస్ సాధించిన తరువాత అందరి అంచనాలు రెట్టింపయ్యాయి. తదుపరి చేయబోయో ప్రాజెక్ట్ గురించి అందరూ ఎంతగానో ఎదురుచూశారు. ఎందుకంటే మహేష్ 27వ ప్రాజెక్ట్ విషయంలో లెక్కలేనన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి.

ఎట్టకేలకు పరుశురామ్..
మొదటగా వంశీ పైడిపల్లితో సినిమాను కన్ఫామ్ చేసినా.. చివరకు పరుశురామ్ ప్రాజెక్ట్ సెట్ అయింది. కృష్ణ బర్త్ డేను టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. సర్కారు వారి పాట అనే టైటిల్ పోస్టర్‌తోనే రికార్డులు క్రియేట్ చేశాడు. టైటిల్ అందరికీ నచ్చేయడంతో సినిమాపైనా అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి.

కీర్తి సురేష్ ఫైనల్..
మహేష్ బాబు లాంటి హీరో పక్కన ఏ హీరోయిన్ అయినా సరే వెలవెలబోవాల్సిందే. అయితే ప్రతీ సారి మహేష్ స్థాయికి తగ్గ హీరోయిన్‌నే ఫిక్స్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈ సారి మహేష్ సరసన కీర్తిసురేష్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కీర్తి సురేషే లైవ్‌లో క్లారిటీ ఇచ్చింది.

ప్రతినాయకుడిగా..
మహేష్ బాబుకు ప్రతినాయకుడిగా ఎందరి పేర్లో చర్చలకు వస్తోంది. ఆ హీరో ఈ హీరో అంటూ ఏదో ఒక వార్త నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే కన్నడ స్టార్స్ కిచ్చా సుదీప్, ఉపేంద్ర పేర్లు వచ్చాయి. తాజాగా మరో హీరో పేరు కూడా తెరమీదకు వచ్చింది.
Recommended Video

హ్యాండ్సమ్ వర్సెస్ వర్సెస్..
హ్యాండ్సమ్ హీరో అరవింద స్వామి.. మన హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబుతో పోటీ పడబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని టాక్. ఇందు కోసం అరవింద్ స్వామికి బాగానే ముట్టజెప్పినట్టు సమాచారం. మరి ఇది మైండ్ గేమ్ ఆటలానే ఉంటుందో లేదో చూడాలి. అయితే సర్కారు వారి పాట షూటింగ్ మాత్రం ఇప్పట్లో మొదలు కాదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











