రామ్ పోతినేనికి విలన్‌గా మరో స్టార్ హీరో.. మళ్ళీ 11ఏళ్ళ తరువాత..
యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరోసారి కెరీర్ పై చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. చాలా కాలం తరువాత ఇస్మార్ట్ శంకర్ తో హిట్టు కొట్టిన రామ్ మళ్ళీ అదే తరహాలో సక్సెస్ చూడాలని రెడ్ సినిమాతో వచ్చాడు. కానీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు లింగుస్వామి సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమాలో విలన్ పాత్రపై అనేక రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి.

కొంత మార్కెట్ ను అయితే పెంచుకున్నాడు
రామ్ పోతినేని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 15 ఏళ్లవుతోంది. ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద వీలైనంత వరకు తన మార్కెట్ ను పెంచుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఈ హీరో ప్లాన్స్ ప్రతీ సారి వర్కౌట్ అవ్వడం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో అసలైన తన మాస్ యాంగిల్ ను బయటపెట్టి కొంత మార్కెట్ ను అయితే పెంచుకున్నాడు.

బడ్జెట్ కూడా గట్టిగానే
ఇక ఇస్మార్ట్ శంకర్ అనంతరం చేసిన రెడ్ సినిమా అంచనాలకు తగ్గట్లుగా ఆడలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం పెట్టిన బడ్జెట్ ను మాత్రమే వెనక్కి తీసుకువచ్చింది. ఇక లింగుస్వామితో చేస్తున్న సినిమాతో అంతకుమించి అనేలా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. సినిమాకు బడ్జెట్ కూడా గట్టిగానే పెడుతున్నారు. సినిమా బడ్జెట్ 50కోట్లు అని కథనాలు వస్తున్నాయి.

విలన్ గా తమిళ హీరో
ఇక రామ్ చేస్తున్న ఆ బైలాంగ్యువల్ సినిమాలో విలన్ గా తమిళ్ హీరోను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ హీరో మరెవరో కాదు. కండలు తిరిగిన హీరో అర్య. ఈ నటుడు కేవలం హీరోగానే కాకుండా అప్పుడప్పుడు సపోర్టింగ్ రోల్స్ కూడా ఆకట్టుకుంటు ఉంటాడు. ఇక మళ్ళీ 11 ఏళ్ళ తరువాత తెలుగు హీరోతో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అప్పట్లో వరుడు సినిమాలో విలన్ గా..
ఆర్య ఇదివరకే ఒకసారి తెలుగు సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. 2010లో గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వరుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో ఆర్య విలన్ గా నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. కానీ సినిమా అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. మరి రామ్ సినిమాకు ఆర్య ఇమేజ్ ఎంత వరకు హెల్ప్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











