ఆర్యన్ రాజేష్ వివాహ తేదీ ఖరారు
స్వర్గీయ దర్శకుడు ఇవివి సత్యనారాయణ తనయుడు ఆర్యన్ రాజేష్ వివాహం పిభ్రవరి 2012 నెలాఖరులో ఉంటుందని సమాచారం. హాయ్ నుంచి ఎవరి గోలవారిదే వారిదే సినిమా లు చేసిన రాజేష్ సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయారు.దాంతో వివాహానంతరం ఇవివి బ్యానర్ పై వరసగా సినిమాలు నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇవివి గారు బ్రతికి ఉండగానే సంభందం సెటిలైనా ఆయన మరణంతో వాయిదా పడింది.సంవత్సరం దాకా చేసుకోకూడదని ఆగి నెక్ట్స్ పిబ్రవరిలో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక అతను వివాహమాడబోయే అమ్మాయి చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్త కూతురుని సమాచారం.
ఇక రాజేష్ తమ్ముడు అల్లరి నరేష్ ప్రస్తుతం కామిడీ హీరోగా బిజీగా ఉన్నాడు.మొన్న శుక్రవారమే అతని తాజా చిత్రం మడతకాజా విడుదలైంది. ఇక తన తండ్రి డైరక్ట్ చేసిన సినిమాల రీమేక్ తో నిర్మాతగా రాజేష్ కెరీర్ ప్రారంభించనున్నాడని చెప్తున్నారు. తన తమ్ముడునే హీరోగా పెట్టి మొదటి సినిమాని ప్లాన్ చేస్తారని చెప్తున్నారు.ఇక ఆ తర్వాత బయిట హీరోలతో కూడా చేస్తాడని తెలుస్తోంది. ఇక ఎక్కవ హాస్య రస ప్రధాన చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నాడని,అవి అయితే సేఫ్ జోన్ లో ఉండవచ్చని, తన తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేసినట్లు అవుతుందని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











