జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి చంద్రగిరి వెళ్ళవద్దని మహేష్ స్వయంగా చెప్పాడనే వార్త ఇప్పుడిప్పుడే బయిటపడి ప్రచారంలోకి వస్తోంది. అక్కడ తెలుగుదేశం తరుపున పోటీచేసి ఓడిపోయిన రోజాకి ఈ విషయం మింగుడుపడటం లేదంటున్నారు. ఇన్నాళ్ళూ ఇది రూమర్ అని కొట్టివేశినా అది కన్ఫర్మ్ గా నిజమేనని తెలియటం ఆమెను విస్మయపరిచిందని తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ ..మహేష్ క్లోజ్ ప్రెండ్స్. దాంతో తన సోదరి అత్తగారైన గల్లా అరుణకుమారిని గెలిపించటానికి మహేష్ నిర్ణయించుకున్నాడు. అందులోనూ మహేష్ సోదరి కూడా ఆ పాంత్రాల్లో తన అత్తగారు తరుపున ప్రచారం చేసింది. అప్పుడు తన ఇండైరక్ట్ గా ఆడబిడ్డను గెలిపించటానికి మహేష్ ఈ పనిచేసాడనేది అంటున్నారు. దాంతో అక్కడ ప్రచారానికి వచ్చిన బాలకృష్ణపై ఆ నెపం వేస్తున్నారు. ఓడిపోవటానికి కారణం ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవటమేనని రోజా తన వారి దగ్గర వాపోతోంది. అదీ సంగతి.