»   » స్టార్ దర్శకుడితో లక్స్ పాప రాసలీలలు!

స్టార్ దర్శకుడితో లక్స్ పాప రాసలీలలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ఓ చిత్రంతో తెలుగు చలన చిత్ర రికార్డులు తిరగరాశారు. కానీ ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక విజయం కోసం ఎదురుచూస్తున్నారు. విక్టరీ వెంటకటేష్ తో 'నువ్వు నాకు నచ్చావు", బాలయ్యతో 'నరసింహానాయుడు" చిత్రంలో నటించి తన ప్రతిభను చాటుకొన్న ఆశాషైనీ ఏ మాయ చేసిందో ఏమో గానీ ..ఆమె ఒడిలో ఆ దర్శకుడు సేద తీర్చుకుంటున్నాడు.

లక్స్ పాప..లక్స్ పాప లంచ్ కొస్తావా అంటే ఏకంగా మనసులోకి వచ్చి గిలిగింతలు పెట్టింది. ఆ గిలిగింతలకు పులకించిపోయిన ఆ దర్శకుడు ఆమెకొక ఇల్లు కొనిపెట్టాడు. ఇక్కడైతే తెలిసిపోతుందని ఏకంగా ముంబాయి సముద్ర తీరాన ఐదు కోట్లు పెట్టి అమ్మడిపేరున ఇల్లు రాసిచ్చేశాడు. 'మనసా..వాచా...మనసిస్తే మైసూర్ ప్యాలెస్ రాసిస్తా.." అన్న పాటను ఇన్సిపిరేషన్ గా తీసుకున్నాడు కాబోలు. మనసా...వాచా.. మనసివ్వకపోయినా, తనువిచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా ఐదుకోట్లు సమర్సించుకున్నాడు.

ఈయనకు ఓ బాలీవుడ్ నటి అంటే బాగా ఇష్టం. ఆమెను ఎలాగైనా డైరెక్ట్ చేయాలనుకున్నాడు. పెద్ద అందంగా లేకపోయినా కోటి రూపాయలు ఇచ్చి తన సినిమాలో బుక్ చేసి చిరకాల కోరికను తీర్చుకుని అభిమానం చాటుకున్నాడు. మొత్తానికి ఆశాషైనీ ఏ మాయ చేసిందోగానీ, తన శృంగార బంతికి అగ్ర దర్శకుణ్ణి క్లీన్ బౌల్డ్ చేసిందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu