మెగా హీరోను పట్టేసిన అషికా రంగనాథ్.. టాప్ దర్శకుడితో బంపర్ ఆఫర్!
రానున్న రోజుల్లో ఇండియన్ సినిమా దగ్గర మరిన్ని బిగ్గెస్ట్ సినిమాలు అదిరిపోయే కాంబినేషన్ లు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఆల్రెడీ లాక్ అయ్యిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ కాంబినేషన్ లలో సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే దర్శకుడు సుకుమార్ ల కాంబినేషన్ కూడా ఒకటని చెప్పాలి.
కాగా వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమానే తెలుగులో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇలా ఫైనల్ గా రికార్డు వసూళ్లు వీరు సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాతే పుష్ప అనే సినిమాలు చేసి సుకుమార్ పాన్ ఇండియా దర్శకునిగా కూడా మారారు. అంతెందుకు రంగస్థలం సినిమా చూసే పుష్ప ని కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో హీరోకి ఒక లోపంతో తెరకెక్కించారు అనే మాటలు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో లేకపోలేవు.

ఇలా సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ అంటేనే ఒక బ్రాండ్ ఉంది. కాగా ఇపుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఓ బిగ్ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు. కాగా ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ రొమాన్స్ చేయనున్న హీరోయిన్స్ విషయంలో గత కొన్నాళ్ల నుంచి మంచి సస్పెన్స్ నడుస్తుంది.
కాగా అలా తన రంగస్థలం బ్యూటీనే సమంత పేరు మళ్ళీ రేస్ లోకి రాగా ఈమె తర్వాత పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా పేరు కూడా వచ్చింది. కాగా వీరిలో రామ్ చరణ్ మునుపు రష్మికతో సినిమా చేయలేదు. అయితే సుకుమార్ కూడా రామ్ చరణ్ సరసన కొత్త అతను ఇది వరకు నటించని హీరోయిన్నే పెట్టనున్నారని రూమర్స్ వచ్చాయి. కాగా రష్మిక పేరుకి అయితే నెగిటివ్ బాగా వచ్చింది.

అందుకే ఇపుడు సుక్కు ప్లాన్ ఛేంజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా రామ్ చరణ్ ఈసారి ఓ యంగ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఎవరో కూడా తెలుగులో నాగార్జున నటించిన "నా సామిరంగా" బ్యూటీ ఆషిక రంగనాథ్ అట. కాగా ఈ యంగ్ హీరోయిన్ తన అందంతో పాటుగా గ్లామరస్ లుక్స్ తో కూడా ఆకట్టుకుంది. ఇలా చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ కోసం ఈమెని పెట్టాలని చూస్తున్నారట.
సో ఇది నిజం అయితే మాత్రం గ్లోబల్ స్టార్ తో ఈ నటి రొమాన్స్ చేయనుంది అని చెప్పవచ్చు. కాగా ఇపుడు ఈ రూమర్స్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. అన్నట్టు ఆషిక రంగనాథ్ రామ్ చరణ్ కంటే ముందు చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భారీ సినిమా 'విశ్వంభర'లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. కాగా ఈ సినిమాలో ఈమె హీరోయిన్ గా కాదు కానీ ఒక కీలక పాత్రలో అయితే కనిపించనుంది. సో ముందు మాత్రం కొడుకు కంటే ముందు నాన్న సినిమాలోనే ఈ యంగ్ భామ మెరవనుంది అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











