టాప్ స్టార్స్ ని ఇంట్రడ్యూస్ చేసిన బ్యానర్ లో మరో మెగాయంగ్ హీరో...
చిరంజీవి ఫ్యామిలీ నుండి మరో కుర్రాడు హీరోగా పరిచయం కాబోతున్నాడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆగమనానికి అంతా సిద్దమవుతోంది. మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ని పరిచయం చేసిన వైజయంతి మూవీస్ బ్యానర్ లో వరుణ్ తేజ్ తొలి సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయని తెలిసింది.
వరుణ్ తేజ్ ని తన బ్యానర్ పై పరిచయం చేయడానికి స్వయంగా అశ్వనీదత్ ముందుకు రావడంతో నాగబాబు కాదనలేకపోయాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఇప్పటికే పవన్, చరణ్, అర్జున్ లకి తోడు ధరమ్ తేజ కూడా హీరోగా పరిచయమవుతన్నాడు. దానికి తోడు చిరంజీవి సైతం త్వరలోనే పున:ప్రవేశం ఖాయమని అంటున్నారు. ఈ నేపత్యంలో మెగా కుంటుంబం నుంచి మరో హీరో అంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. అయితే వరుణ్ తేజ్ మాత్రం చాలా బాగుంటాడని, మంచి హైటు, కలరు ఉన్న వరుణ్ కి తప్పక అభిమానుల అండదండలు లభిస్తాయని చిరంజీవి కుటుంబ సన్నిహితుల అభిప్రాయం.


Click it and Unblock the Notifications











