పాపం..అశ్వనీదత్ కి ఆ తలనొప్పికటి చుట్టుకుంది
భారీ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ సినీ పరిశ్రమ పరంగా పెద్ద పెద్ద సమస్యలు కూడా చాకచక్యంగా తీర్చుకో కలుగుతాడని పెద్ద పేరు. అటు వంటి ఆయన ఈ మధ్య డీలాపడ్డారని సమాచారం. కారణం తన కుమార్తెలు కావటంతో ఏం చేయలేకపోతున్నారు. త్రి ఏంజిల్స్ బ్యానర్ పేరుతో నిర్మించిన బాణం, ఓం శాంతి భాక్సాఫీస్ వద్ద క్లిక్ కాలేదు. అయితే దాన్ని మరో చిత్రంతో తీర్చుకోవచ్చు కానీ పెద్ద కుమార్తె స్వప్నదత్ పెట్టిన లోకల్ టీవీ ఛానెల్ మాత్రం తెల్ల ఏనుగులా తయారైందని వినికిడి. పెద్దగా ఏడ్స్ లేక, ఉన్న పోగ్రామ్ లు క్లిక్ కాక ఆదాయం మందగించి ఇంట్లోంచి పట్టుకెళ్ళి ఛానెల్ లో డబ్బులు పెడుతున్నారని చెప్పుకుంటున్నారు. సినిమా నిర్మాతగా అయితే ఓ ఆరు నెలల్లో పూర్తి వ్యాపారం ముగుస్తుంది..లాభ నష్టాలు తేలుతాయి గానీ ఈ ఛానెల్ కు మాత్రం ఎంతకాలానికి లాభాలు బాట పడుతుంది...అసలు పడుతుందా లేదా అన్న విషయాల్లో క్లారిటీ ఉండదని వాపోతున్నారుట. ఇక అశ్వనీదత్ ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా శక్తి చిత్రం చేస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం భారీగా రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











