మహేష్ బాబు కొత్త సినిమా ‘శివం’?
సూపర్ స్టార్ మహేష్ బాబు గమ్యం, వేదం ఫేం క్రిష్ దర్శకత్వంలో 'శివం' సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
మహేష్ బాబు తాజా సినిమా 'బిజినెస్ మేన్' జనవరి 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్వకత్వంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', అనంతరం సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. వీటి తర్వాత క్రిష్-మహేష్ బాబు కాంబినేషన్లో 'శివం' సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
డిఫరెంట్ కథాంశంతో 'శివం' చిత్రాన్ని రూపొందిస్తున్నారని, గతంలో మహేష్ బాబు ఎన్నడూ కనిపించని విధంగా ఇందులో దర్శనం ఇవ్వబోతున్నాడని, విభిన్నమైన, విలువలతో కూడిన చిత్రాలు తీస్తాడని మంచి పేరు సొంతం చేసుకున్న క్రిష్ ఈ చిత్రం కోసం చాలా పక్బంధీ స్క్రిప్టు తయారు చేసుకున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











