ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆద్వర్యంలో ఆయన కుమార్తె సప్నాదత్ ఒక టీవి ఛానెల్ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ఛానెల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఈ ఛానెల్ లోకల్ గా ఉంటూ కేబుల్ టీవీలా నడుస్తుందని సమాచారం. ఇందులో హైదరాబాద్ కు సంభందించిన వార్తా విశేషాలు మాత్రం అందిస్తారు.అందులో ముఖ్యంగా పేజ్ త్రి కవరేజ్ ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్ లో పెరిగిన కాస్మోపాలిటన్ కల్చర్ ని ప్రతిబింబిస్తూ పబ్స్,నైట్ క్లబ్స్ ,పార్టీలతో ఫాషన్ ఛానెల్ లా అలరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. మార్కెటింగ్ లో తన దైన శైలిని ప్రతిబింబించటానికి స్వప్న ఈ స్కీమ్ తో వస్తోందని..దీనికి సినీ పరిశ్రమ కూడా సహకరించటానికి రెడీగా ఉందని తెలుస్తోంది.