అశ్వనీదత్ హీరో నారా వారి..

తెలుగు మహిళ రోజాకు చంద్రగిరిని కేటాయించటంతో నారా రామ్ముర్తి నాయుడు నిరాశచెందాడని,అతడిని బుజ్జగించటానికే ఈ ప్రయత్నం అని అంటున్నారు.చంద్రబాబు సలహాపైనే ఈ నిర్ణయానికి అశ్వనీదత్ వచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చను కూడా బాబే భరించే అవకాశాలనున్నాయని గుసగుసలువినపడుతున్నాయి.
గతంలో అశ్వనీదత్ చాలా మంది తెలుగు వారస హీరోలను విజయవంతంగా లాంచింగ్ చేసిన అనుభవంతో ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దంతులూరి చైతన్య అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేయనున్నాడు. చైతన్య ప్రస్తుతం హ్యాపీడేస్ నికిల్ హీరోగా బసంతి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఎలక్షన్స్ వచ్చే లోగా మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అశ్వనీదత్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











