twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అశ్వనీదత్ హీరో నారా వారి..

    By Staff
    |

    Ashwini Dutt
    అశ్వనీదత్ ఓ రాజకీయ నాయకుడు కుమారుడుని హీరోగా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అతనెవరనేది ఇప్పుడు చర్చగా మారింది. అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం అతను మరెవరో కాదని, నారా వారి వారసుడు అని సమాచారం. నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ అని తెలుస్తోంది. అది కూడా రాజకీయంగా ఓ స్ట్రాటజీ ప్రకారమేనంటున్నారు.

    తెలుగు మహిళ రోజాకు చంద్రగిరిని కేటాయించటంతో నారా రామ్ముర్తి నాయుడు నిరాశచెందాడని,అతడిని బుజ్జగించటానికే ఈ ప్రయత్నం అని అంటున్నారు.చంద్రబాబు సలహాపైనే ఈ నిర్ణయానికి అశ్వనీదత్ వచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ చిత్ర నిర్మాణానికి అయ్యే ఖర్చను కూడా బాబే భరించే అవకాశాలనున్నాయని గుసగుసలువినపడుతున్నాయి.

    గతంలో అశ్వనీదత్ చాలా మంది తెలుగు వారస హీరోలను విజయవంతంగా లాంచింగ్ చేసిన అనుభవంతో ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి దంతులూరి చైతన్య అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేయనున్నాడు. చైతన్య ప్రస్తుతం హ్యాపీడేస్ నికిల్ హీరోగా బసంతి అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఎలక్షన్స్ వచ్చే లోగా మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అశ్వనీదత్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X