ఆ దర్శకుడితో ఆసిన్ ‘సం’బంధం!

By Bojja Kumar

బాలీవుడ్‌లో పాగా వేసిన సౌతిండియా బేబీ ఆసిన్ గురించి ఓ విషయం ఇప్పడు హిందీ చిత్ర సీమలో హాట్ టాపిక్ అయింది. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీతో ఆసిన్ ఏదో 'సం'బంధం కొనసాగిస్తోందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో పని చేసిన ఆసిన్ అతనికి చాలా క్లోజ్ అయిందని అంటున్నారు. బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఇద్దరు ఈ మధ్య కలిసి తిరుగుతున్నారని, ఏ సందర్భం వచ్చినా ఒకరి గురించి ఒకరు ప్రశంసించుకుంటున్నారని అంటున్నారు. ఇతరులను కలుపుకోకుండా పార్టీలకు, పబ్బులకు కూడా తిరుగుతున్నారని తెలుస్తోంది.

ఇటీవల షూటింగ్ సెట్ లోనే రాజ్ కుమార్ హిరాణి పుట్టిన రోజు వేడుక జరుపుకున్నాడు. ఈ వేడుకలో రాజ్ కోసం ఆసిన్ స్వయంగా పాట పాడింది. అతడు తీయబోయే తర్వాతి చిత్రం కార్బీలో కూడా ఆసిన్ కు చోటు దక్కింది. ఇందులో కొన్ని సీన్లు చిత్రీకరించేందుకు ఆసిన్ ను థాయ్ లాండ్ తీసుకెలుతున్నాడు ఆ దర్శకుడు. అతడితో కలిసి పని చేయడం చాలా థ్రిల్ గా ఉందని, అతడు చాలా సింపుల్ గా ఉంటాడు, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వారు చాలా అరుదుగా ఉంటారు అంటూ ఓ..తెగ పొగిడేస్తోంది ఆసిన్. ఈ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏదో 'సం'బంధం ఉందనే ఊహాగానాలు బాలీవుడ్ లో షికారు చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X