అసిన్ పై బ్యాన్?

ఇలా దీక్షలో పాల్గొనక పోవటమే కాక అందుకు తగిన కారణాలు తెలియ జేస్తూ వివరణ ఇవ్వటంలో విఫలమైన పలువురు సినీ ప్రముఖులపై చర్య తీసుకోవాలన్నది అసోసియేషన్ నిర్ణయంట. దానిపై వారి అధ్యక్షుడు శరత్ కుమార్ వచ్చే వారంలో ఇక్కడకు తిరిగి రాగానే పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటారనీ ఆయన వివరించారు. దీక్షలో పాల్గొనలేకపోవటానికి కారణం తెలియ చేయటంలో విఫలమైన వారిలో ఆసిన్ తో పాటు నెపోలియన్,కార్తీక్ ,రాధిక కూడా ఉన్నారు. అలాగే ఇంకా ఆర్య, సిమ్రాన్, నవ్య నాయర్, గోపిక, పద్మప్రియ, నీల, దర్శకులు కె.బాలచందర్, భారతీ రాజా, మణిరత్నం, శంకర్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వీరందరికి రాజకీయంగా పలుకుబడి, గాడ్ ఫాధర్ లు ఉన్నారని అసిన్ కి అలాంటివి లేక పోవటంతో తప్పించుకోవటం కష్టమే అంటున్నారు. అసిన్ నటించిన దశావతారం త్వరలో రిలీజుకు రెడీ అవుతోంది.


Click it and Unblock the Notifications











