Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వెంకటేష్ సరసన అసిన్ మరోసారి కనిపించనుందా?
ఘర్షణ చిత్రంలో వెంకటేష్ సరసన నటించిన అసిన్ మరోసారి కాంబినేషన్ ని రిపీట్ చేయనున్నదని సమాచారం. తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న సావిత్రి చిత్రం కోసం ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. మొదట ఈ పాత్రకు త్రిషను అనుకున్నారు కానీ ఆమె తో చేసిన నమో వెంకటేశ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రక్కన పెడదామనే నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇక వెంకటేష్ కూడా అసిన్ అంటే ఆసక్తి చూపుతున్నాడని చెప్తున్నారు. అయితే అసిన్ దృష్టి మాత్రం బాలీవుడ్ పైనే ఉండటంతో ఆమె ఏక్సెప్ట్ చేస్తుందా లేక డేట్స్ ఖాళీ లేవా అంటుందా అన్న డైలమోలో ఉన్నారుట. ఇక వెంకటేష్ ఈ చిత్రంలో మానసిక వికలాంగుడుగా కనిపంచనున్నాడని ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. నయనతారను కూడా ఈ ప్రాజెక్టు కోసం కన్సిడర్ చేసారు కానీ ఆమె తన పర్శనల్ కారణాలతో రిజెక్టు చేసింది.ఇక తేజ ...కేక వంటి డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. రీసెంట్ గా వెంకటేష్ నాగవల్లి కూడా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటంతో వెంకటేష్ ఆశలన్నీ ఈ చిత్రంపైనే ఉన్నాయి.