ధోని రూమ్ లో అసిన్ శుభాకాంక్షలు....!
ఇటీవల ఓ కమర్షియల్ యాడ్ లో ధోనీతో కలిసి నటించింది అసిన్. ఇక ఈ యాడ్ లో నటించినప్పటి నుంచి వీరిద్దరూ విడదీయరాని రీతిలో ఫ్రెండ్స్ అయిపోయారని బాలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. అయితే ఇటీవలే సాక్షి రావత్ ను పెళ్ళి చేసుకున్న దోని మూడు ముళ్ళేసి మూడు వారాలన్నా గడవకముందే క్రికెట్ కోసం కొలంబో వెళ్లిన ధోని ఓ హోటల్ లో బస చేశాడు ఇక అక్కడ 'రెడీ" సినిమా కోసం అసిన్ వచ్చింది. ఇంకేముంది ఇద్దరూ కొలంబోలో ఒకే హోటల్ లో ఒకే రూమ్ లో బస చేశారు. ఈ విషయమై అసిన్ ను ప్రశ్నిస్తే...ధోని నేను ఒకే హోటల్ లో ఉన్న మాట వాస్తవమే కానీ మేమిద్దరం మంచి స్నేహితులం. అతని పెళ్లికి నేను హాజరు కాలేకపోయాను, అందుకే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపానని" ఈ ముద్దుగుమ్మ వెల్లడించిందట.


Click it and Unblock the Notifications











