twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసిన్ ను ఏం చేసిన అప్పటి వరకే నట!

    By Sindhu
    |

    'గజినీ' చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన అసిన్‌పై అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ మంచి పేరే తెచ్చుకున్నా, ఆమెకు అక్కడ ఆఫర్స్ వెల్లువలా వరించకపోయినా వచ్చినంత వరకు మంచి అవకాశాలే అవుతున్నాయి. ప్రస్తుతం 'లండన్" డ్రీమ్స్" చిత్రంతో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న ఆసిన్కు ఇటీవలే ప్రముఖ భాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించే చాన్స్ కొట్టేశారు. ఆ చిత్రంలో అబిషేక్ బచ్చన్ హీరో కావడం మరో విశేషమైతే మొదట్లో ఐశ్వరాయ్ ను అనుకున్న పాత్రకు అసిన్ ను ఎంపిక చేసుకోవడం మరో ఆసక్తికరమైన విషయం. ఇదిలా వుండగా ఈ మద్య రకరకాలుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసిన్‌కు సల్మాన్ ఖాన్ ఇల్లుకూడా కట్టించాడనే వార్త ఫిలిమ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

    ఈ విషయమై అసిన్ స్పందిస్తూ...'నేను షూటింగ్‌లో ఉండగా ఆ గాలి వార్త వచ్చింది. అప్పుడే సల్మాన్ ఖాన్ వచ్చి 'ఎలా ఉంది నీ కొత్త ఇల్లు..?" అంటూ తమాషాగా అడిగారు. పక్కనే ఉన్న అజయ్‌దేవ్‌గన్, విపుల్‌షాలు మాత్రం నవ్వుకున్నారు. ఆ తర్వాత వార్త నిజమేనంటూ.. పలు పలు వెబ్‌సైట్లు రూమర్స్ ప్రచారాలు చేసేశాయి. అలాగే నాకు పెళ్లికూడా అయిపోయినట్లు వార్తలొచ్చాయి. అమీర్‌ఖాన్‌కు నాకు మధ్య మీరనుకున్న సంబంధంలేదు. మా ఇద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని అసిన్ చెప్పుకొచ్చింది. అంతేకాదు మేమిద్దరం మంచి స్నేహితులం. నన్ను ముట్టుకున్న ప్రేమించినా అది సినిమా వరకే అంటూ అసిన్ స్పష్టం చేసింది. ఇంకేముంది..? అదే అసిన్ చెప్పేసిందిగా..అమీర్‌ ఖాన్ మంచి స్నేహితుడేనని నమ్మాల్సిందే మరి.

    ఇప్పటి వరకూ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో చిత్రాలు చేసిన అసిన్ కు బాలీవుడ్ లో వున్న మరో ప్రముఖ హీరో షారుక్ ఖాన్ తో నటించాలనే కోరిక ఎప్పట్నుంచో వుందట. కానీ అసిన్ ను అనుకోకుండా ఆ అరుదైన అవకాశం వరించినా ఆమె ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారని సమాచారం. కొన్ని రోజుల కిత్రం బాలీవుడ్ దర్శకులు ఫరాఖాన్ తను తెరకెక్కిస్తున్న 'హ్యాపీ న్యూ ఇయర్" చిత్రంలో అసిన్ ను షారుఖ్ సరసన కథానాయికగా అనుకున్నారట. కానీ డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని తిరస్కరించిందట. మరి ఇంత మంచి అవకాశాన్ని చేజార్చుకొన్న అసిన్ అదష్టాన్ని ఎవరు అందుకుంటారో అని బాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X