పూరీ జగన్ ని ఆ హీరోయిన్స్ వేధిస్తున్నారు
పూరీ జగన్నాధ్ కి ఇప్పుడు బాలీవుడ్ లో హిట్ రావటంతో అతన్ని మంచి చేసుకోవాలనే ఆలోచన చాలా మందిలో మొదలైంది.ముఖ్యంగా ఆయనతో పనిచేసిన హీరోయిన్స్ ఆయనకు పోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెప్పటం..ఒకసారి కలుద్దాం..మీరు ముంబై వచ్చినప్పుడు మా ఇంటికి రావాలనటం ఎక్కువైందిట.అందులో ముఖ్యంగా అసిన్ నుంచి ఫోన్ లు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. మొన్నే సల్మాన్ ఖాన్ తో రెడీ చిత్రం చేసిన ఆమె ఎలాగైనా బాలివుడ్ లో సెటిల్ అవ్వాలనుకుంటోది.కానీ ఆమెకు అక్కడ పెద్ద గా ఆఫర్స్ రావటం లేదు.
సౌత్ డైరక్టర్ గానీ, సౌత్ సినిమా రీమేక్ గానీ అయితేనే ఆమె గుర్తుకు వస్తోంది.దాంతో ఇప్పుడు పూరిని లైన్ లో పెట్టి తన పాత పరచియం ద్వారా అతని నెక్ట్స్ సినిమాలో ఆఫర్ సంపాదించాలనే ఆలోచలో ఉంది. అందులోనూ పూరి అంతకు ముందు అసిన్ తో చేసిన అమ్మా..నాన్న,...తమిళ అమ్మాయి చిత్రం రీమేక్ చేసే ఆలోచనలో ఉండటం ఆమెకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. ఇలియానా కూడా ఇప్పుడు రోజూ పూరికి టచ్ లో ఉంటోంది. ఎవరి ట్రైల్స్ వారివి ఏమంటారు.


Click it and Unblock the Notifications











