»   »  నిజమా....ఆయన సలహాతోనే పవన్ పార్టీ?

నిజమా....ఆయన సలహాతోనే పవన్ పార్టీ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టడం ఖాయమైంది. 'జన సేన' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించనున్నారు. ఈ నేపధ్యంలో రకరకాల వార్తలు,రూమర్స్ ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా పవన్ ని వెనక ఉండి ఓ జ్యోతిష్యుడు నడిస్తున్నాడని, ఆయన సూచనలు మేరకే పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే పవన్ వంటి స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తి ఇలా ఎవరో చెప్తే విని నిర్ణయాలు తీసుకుంటాడా అనేది ఆలోచించాల్సిన విషయం.

మీడియాలో వినపడుతున్నదాని ప్రకారం ఆ అస్ట్రాలజర్ పేరు నరిసింహన్. అత్తారింటికి దారేది ఓపినింగ్ లో పవన్ ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు..కాబట్టి ఆయనే పవన్ ఆలోచనలకు ఆయష్షు పోసాడంటున్నారు. అయితే ఇలాంటి రూమర్స్ లో నిజం ఉండదనేది మాత్రం నిజం. రాజకీయ పార్టీ వివరాలను శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే బహిరంగ సభలో ఈ విషయాన్ని పవన్ ప్రకటించటానకి కూడా ఆయనే ముహూర్తం పెట్టారని అంటున్నారు. పార్టీ పేరు ని సైతం న్యూమరాలిజీ ప్రకారం చూసి సెట్ చేసారని చెప్పుకుంటున్నారు.

Astrologer Narasimhan Behind Pawan kalyan Political Ideas

ఇక వరస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో ఆయన పవన్ ని కలిసారని, తర్వాత గబ్బర్ సింగ్ హిట్ పడిందని అందుకే పవన్ కి ఆయనంటే నమ్మకం అని చెప్పుకుంటున్నారు. కానీ నమ్మకానికి,ప్రజల కోసం పెడుతున్న పార్టీకి ముడి పెట్టడం మాత్రం ఆశ్చర్యకరమే.

ఇక కొంతకాలంగా పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టే విషయమై అభిమాన సంఘాల నేతలు, సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలోని కొందరు మేధావులతో చర్చించారు. పార్టీ పెట్టాలా? స్వతంత్రంగా పోటీ చేయాలా? ఏదైనా పార్టీలో చేరాలా? అన్నదానిపై చర్చలు జరిగాయి. చివరకు సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించారు. అభిమానుల నడుమ హైటెక్స్‌లో జరిగే బహిరంగ సభలో పవన్‌ ఈ విషయం చెప్పనున్నారు.

ఇప్పటికే హైటెక్స్‌లో సభ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు చేయాల్సిన ప్రసంగం పైనా పవన్‌ ప్రత్యేక కసరత్తు చేస్తున్నారని సమాచారం. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నది? ఆశయాలు? లక్ష్యాలు ఏంటి? ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను కూడా ఇందులో స్పృశించనున్నారు. 45 నిమిషాల సేపు ఆయన ప్రసంగం ఉంటుంది. పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయం కూడా ఆయన పార్టీ పెడుతున్న విషయాన్ని ధ్రువీకరిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

పార్టీకి ఏ పేరు పెట్టాలన్న దానిపైనా పలు చర్చలు జరిగాయి. జనం కోసం పార్టీ పెడుతున్నందున 'జన సేన' అంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అదే పేరు ఖరారు చేశారని తెలిసింది. పవన్‌ కళ్యాణ్‌ శాసనసభకు పోటీ చేయాలా? లోక్‌సభకు పోటీ చేయాలా?అన్నదానిపైనా చర్చలు జరుగుతున్నాయి. ఆయన కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేస్తారని తొలుత అన్నా...మొగ్గు కాకినాడకే ఎక్కువ ఉందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లోనూ పోటీ చేయడం కాకుండా...బలం ఉంటుందని భావిస్తున్న చోట్లే పార్టీ అభ్యర్థులను బరిలో ఉంచాలని అనుకుంటున్నారని తెలిసింది.

English summary
Narasimhan, an astrologer is the one who advised Pawan Kalyan to launch a party it seems. Pawan Kalyan madly respects Narasimhan as he had foreseen many things in Pawan's life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu