Venu Swamy: మరో బాంబు పేల్చిన వేణుస్వామి... ఆమె వల్ల వరుణ్ తేజ్, లావణ్య విడిపోతారంటూ సంచలనం!
సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన క్రెజ్ తెచ్చుకున్న ఆయన... సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి అనేక ప్రిడిక్షన్స్ చెబుతూ ఉంటాడు. సమంత నాగచైతన్య విడిపోతారని వివాహం సమయంలోనే చెప్పిన ఆయన... ఇప్పుడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే...
నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి ఈ మధ్యనే డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకున్నారు. వీరి వివాహం ఇటలిలో కుటుంబసభ్యుల నడుమ అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట భలే చూడముచ్చటగా ఉందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో వేణు స్వామి మాత్రం అందుకు భిన్నంగా కామెంట్లు చేసి కలకలం రేపినట్లుగా తెలుస్తోంది.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం కలిసి రాదని వేణు స్వామి కామెంట్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. లావణ్య, వరుణ్ జాతకాల్లో గురువు, శుక్రుడు ఇద్దరు నీచ స్థానంలో ఉన్నారనీ ఆ కారణంగా వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉంటారో లేదో నమ్మకం లేదనీ వేణు స్వామి కామెంట్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక వరుణ్ తేజ్ కి నాగదోషం, లావణ్య త్రిపాఠికి కుజదోషం ఉందనీ ఆ కారణంగా వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉండటం కష్టమే అని ఓ యూట్యూబ్ ఇంటర్వూలో ఆయన సంచలన కామెంట్ చేశారు. అయితే వీరిద్దరూ విడిపోయే సమయంలో ఇరువురి కుటుంబంలో ఉన్న ఒక ప్రముఖమైన స్త్రీ మూలంగా వీరికి విడాకులు జరుగుతాయి అని కూడా ఒక సంచలన విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూలో వేణు స్వామి బయటపెట్టారనీ తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది మెగా అభిమానులు వేణు స్వామి పై ఫైర్ అవుతున్నారు. అయితే నిజానికి వేణు స్వామి జ్యోతిష్యం కూడా నిజం కాదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఆయన ఒక్కో ఛానల్ కి ఒక్కో విధంగా ఇంటర్వ్యూ ఇస్తాడని ఒకవేళ ఆయన చెప్పింది ఏది జరిగినా ఆ ఛానల్లోని వీడియోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని చూశారా... నేను ఎప్పుడో చెప్పాను ఇలా జరుగుతుందని బిల్డప్ ఇస్తూ ఉంటాడని అంటున్నారు.
అయితే వేణు స్వామి మాత్రం తాను ఎవరిని ఉద్దేశించి కామెంట్లు చేయనని... వారి జాతకాల ప్రకారం ఏం జరగబోతుంది అనేది ముందే ఒక అంచనాకు వచ్చి ఆ వివరాలు చెబుతాను.. తప్ప వారి మీద దానికి ఎలాంటి కోపం ద్వేషం లాంటివి ఉండవు అని చెబుతున్నారు. మరి వేణు స్వామి వ్యాఖ్యలు నిజంగా నిజమైతే టాలీవుడ్ లో మరో జంట విడాకులు కావడం ఖాయమని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి.


Click it and Unblock the Notifications











