అఖిల్ జాతకం మరీ ఇంత ఘోరంగా మారిపోతుందా? - పెళ్లి, సినీ కెరీర్​పై బాంబు పేల్చిన వేణుస్వామి!

వేణు స్వామి.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఆస్ట్రాలజర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాలను, వారి జాతక విషయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాల్లో పాపులారిటినీ పెంచుకున్నారు. ఇప్పుడు అక్కినేని కుటుంబ వారసుడు అఖిల్​పై ఆయన చేసిన కామెంట్లు మరోసారి నెట్టింట్లో ట్రెండింగ్​గా మారాయి. ఇది తెలుసుకుంటున్న అక్కినేని అభిమానులు షాక్ అయిపోతున్నారు. కొంతమందైతే బాగా ఫీలవుతున్నారు. ఇంతకీ ఆ వేణు స్వామి అఖిల్​ గురించి ఏమన్నాడో తెలుసుకుందాం..

అక్కినేని ఫ్యామిలీలో నాగేశ్వరరావు నట వారసత్త్వాన్ని నాగార్జున ఆ తర్వాత నాగ చైతన్య నిలబెడుతూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. చైతూ కాస్త కెరీర్​లో ఒడుదొడుకులను ఎదుర్కొన్న మంచి పేరే సంపాదించుకున్నాడు. ఫ్యాన్ ఫాలోయింగ్​ కూడా బాగానే ఉంది. అయితే అఖిల్ విషయంలో అలా జరగలేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఫ్లాప్​లను ఎదుర్కొంటూనే వస్తున్నాడు.

Astrologer Venuswamy shocking comments about akhil akkineni cinema carrer and professional life full details in story

తొలి సినిమా అఖిల్​తోనే ఆయన గ్రాండ్ డెబ్యూ ఇచ్చారు. కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా డిజాస్టర్​గా నిలిచింది. సర్లే మొదటి సినిమా పోయినా తర్వాత అయినా ఆయన లాక్కొస్తారని అంతా ఆశించారు. అయనా మళ్లీ నిరాశే ఎదురైంది. హలో, మిస్టర్ మజ్ను వరుసగా ఫ్లాపులు అయ్యాయి. దీంతో అఖిల్ సినీ కెరీర్ డైలామాలో పరుడింది. అయితే అఖిల్ పట్టువదలకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కెరీర్​లో ముందుకెళ్లారు.

తనకంటే వయసులో పెద్దదైనా పూజా హెగ్డేతో జత కట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్​గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా మాత్రం మంచి సెక్సెస్​ అందుకుంది. అఖిల్​ కెరీర్​లోనే తొలి విజయంగా నిలిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్​లో కొత్త ఆశలు చిగురించాయి. అయితే ఆ తర్వాత భారీ బడ్జెట్​, అంచనాలతో వచ్చిన ఏజెంట్​ మరింత దారుణంగా నిరాశపరిచింది.

భారీ నష్టాల్ని కూడా మిగిల్చింది. దీంతో అందరూ స్టన్ అయిపోయారు. ఇక అఖిల్ కెరీర్ ఇంతేలే అన్న పరిస్థితికి కూడా వచ్చేశారు. ఇక అఖిల్ పర్సనల్ లైఫ్​లోనూ గతంలో ఓ అమ్మాయితో ఆయన ఎంగేజ్​మెంట్ అయింది. కానీ అది అక్కడితోనే ఆగిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది. దీంతో మళ్లీ అఖిల్​ పెళ్లి ఊసే బయటకు రాలేదు. ఆ తర్వాత అఖిల్ సినిమాల చేసుకుంటూ ముందుకుపోతున్నారు.

Astrologer Venuswamy shocking comments about akhil akkineni cinema carrer and professional life full details in story

అయితే ఈ క్రమంలోనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఆస్ట్రాలజర్​గా గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి ఓ బాంబు పేల్చారు. అఖిల్ కెరీర్​ దారుణంగా ఉందని అన్నారు. సినీ లైఫ్​లో సక్సెస్ అవ్వడం కష్టం అని చెప్పి షాక్ ఇచ్చారు. అఖిల్ కెరీర్​ అటు పర్సనల్​గా ఇటు ప్రొఫెషనల్​గా రెండు దారుణంగా ఉంది. వాళ్ల అమ్మ ఇన్​వాల్వ్​మెంట్​ ఉన్నంత కాలం ఇంతే. నాగార్జున చేతికి అఖిల్​ను అప్పగిస్తేనే తప్ప బాగు పడదు. అక్కినేని ఫ్యామిలీలో దోషాలు ఎక్కువ అన్నాయి. ఇప్పటికే నాగార్జున, చైతన్య విషయంలో జరిగాయి. ఇక అఖిల్​ విషయంలోనూ అదే జరుగుతుంది. అని వేణుస్వామి అన్నారు.

ఇకపోతే అఖిల్​​ తన నెక్ట్స్​ ప్రాజెక్ట్​ను యూవీ క్రియేషన్స్ బ్యానర్​లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఓ సోషియో ఫాంటసీ మూవీతో రానున్నారట. దీని కోసం ప్రస్తుతన్న సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్​మెంట్ రానుంది. చూడాలి మరి ఈ చిత్రం అఖిల్​కు ఎలాంటి రిజల్ట్​ను ఇస్తుందో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X