అనుకోని వివాదాల్లో బన్నీ.. జాతకం చూపిస్తే ఇబ్బందులు తప్పవని తేలడంతో!

ఇటీవల పుష్ప సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆ సినిమా దెబ్బతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. పుష్ప 2 కోసం సిద్ధమవుతున్న అల్లు అర్జున్ తన ఇంట్లో కొన్ని పూజలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బన్నీ జాతకంలో ఉన్న సమస్యలకు పరిష్కారం గానే ఈ పూజలు చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. బన్నీ జాతకంలో ఏం ఇబ్బందులు ఉన్నాయి? అసలు ఎందుకు ఈ విషయం మీద చర్చ జరుగుతోంది అనే వివరాల్లోకి వెళితే..

 ఫాలో అవుతూ

ఫాలో అవుతూ

సెంటిమెంట్ ఫాలో అవని మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. మరీ ముఖ్యంగా హిందూ సంప్రదాయాలు ఫాలో అయ్యే వారికి జాతకాలు ముహూర్తాలు అంటే మరీ ఎక్కువ నమ్మకం ఉంటుంది. సినీ పరిశ్రమ వారు ఈ సెంటిమెంట్లను మరింత ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. తాము కెరీర్లో బాగుండాలి అంటే తన జాతకంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని వారు భావిస్తూ ఉంటారు. అందుకే ఎప్పటికప్పుడు జ్యోతిష్యం మీద ఒక కన్నేస్తూ ఉంటారు.

 కలెక్షన్లు సాధించి

కలెక్షన్లు సాధించి


ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమా 300 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించి ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా దూసుకు వెళ్ళింది. గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలైన ఈ సినిమా డిజిటల్ వేదికగా విడుదలైన తర్వాత కూడా కలెక్షన్లు సాధించింది అంటే సినిమాకి ఉన్న సత్తా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని వివాదాల్లో

కొన్ని వివాదాల్లో


అలా సూపర్ హిట్ అందుకొని మంచి ఫాంలో ఉన్న తర్వాత అల్లు అర్జున్ అనుకోకుండా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన రెండు వ్యాపార సంస్థలకు చేసిన ఎడ్వర్టైజ్మెంట్ ల కారణంగా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఎందుకైనా మంచిది అని భావిస్తున్న ఆయన పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్న నేపథ్యంలో ఒక జ్యోతిష్యుడిని సంప్రదించినట్లు సమాచారం.

 త్వరలో కుటుంబ సమేతంగా

త్వరలో కుటుంబ సమేతంగా

బన్నీ జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యుడు ఆయన జాతకంలో కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలకు పరిష్కారంగా కుటుంబంతో కలిసి కొన్ని పూజలు, హోమాలు చేయాలని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే త్వరలో బన్నీ కుటుంబ సమేతంగా తన ఫాం హౌస్ లో పూజలు, హోమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Recommended Video

Pushpa Movie పై Garikipati Narasimha Rao కామెంట్స్ తప్పా? తగ్గాల్సింది ఎవరు? | Filmibeat Telugu
 వేరే కథ మీద

వేరే కథ మీద

ఇక పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ కి బాలీవుడ్ దర్శకుల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే కథ విన్న వెంటనే ఎగ్జయిట్ అవ్వకుండా అసలు ఆ కథ తనకు సరిపోతుందా లేదా అనే విషయాలు పరిశీలించుకుని మరి చెబుతా అని దర్శక నిర్మాతలను వెనక్కి పంపుతున్నారట అల్లు అర్జున్. ఆలోచించుకుని చెపుతాను అని తన దగ్గరకు వచ్చిన ముగ్గురు నలుగురు దర్శకులకి అల్లు అర్జున్ చెప్పినట్లు సమాచారం. కథలు అయితే విన్నారు కానీ అందులో దేనికీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇంకా ఇవ్వలేదట. ఈ శాంతి పూజల అనంతరం పుష్ప సినిమా షూటింగ్ మొదలు పెట్టి పూర్తి చేసిన తర్వాత వేరే కథ మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X