వెంకటేష్ సరసన శ్రీయ.. మొత్తానికి సూపర్ ఛాన్స్ పట్టేసింది!
అసురన్ సినిమాను తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ హీరోగా తెరకెక్కి తమళనాట సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను దగ్గుబాటి సురేష్ బాబు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందించాలని ఫిక్స్ అయ్యారు.
ఆశారాం తెలుగు రీమేక్ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఓ సీనియర్ హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకున్న సురేష్ బాబు.. శ్రీయ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

హీరోయిన్ శ్రీయ, హీరో వెంకటేష్ మినహాయిస్తే మిగితా అందరినీ కొత్త వారినే తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయని తెలిసింది. సినిమాకు సంబంధించిన ఈ పనులన్నింటినీ కూడా శ్రీకాంత్ అడ్డాల దగ్గరుండి చూసుకుంటున్నాడని టాక్. అన్నీ సెట్ కాగానే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట దర్శకనిర్మాతలు.
ఇక తమిళంలో 'అసురన్' సినిమా వీక్షించిన ప్రతీ ఒక్కరూ జాతీయ అవార్డు రావాల్సిందేనని నొక్కి చెబుతున్నారు. ఈ చిత్రంలో ధనుష్ ధనుష్ నటనపై అంతా ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ధనుష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిల్చిన ఈ సినిమా 150 కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ సునామీ సృష్టించింది. అంతటి సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడం, అందులో వెంకటేష్ హీరోగా నటించనుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొల్పింది.


Click it and Unblock the Notifications











