అసురన్ రీమేక్.. ఆయన చేతికి పగ్గాలు.. వెంకీకి జోడిగా స్వీటి.. వైరల్ న్యూస్

తమిళంలో ఇటీవలె విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం అసురన్. ధనుష్ తన అసాధారణమైన నటనతో సినిమాను విజయ తీరాలకు చేర్చాడు. చేతగాని తండ్రిలా, తలొగ్గి బతికే మామూలు మనిషిగా జీవనం సాగించే పాత్రల్లో ధనుష్ జీవించేశాడు. విమర్శకుల ప్రశంసలతో పాటు, కలెక్షన్ల పరంగా తమిళ నాట సునామిని సృష్టించింది. అలాంటి అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రంగం సిద్దమైంది.

దర్శకుడి కోసం వేట..

దర్శకుడి కోసం వేట..

సురేష్ బాబు నిర్మాణంలో వెంకటేష్ హీరోగా ఈ రీమేక్‌ పట్టా లెక్కబోతోన్నట్లు ప్రకటించారు. వెట్రి మారన్ తెరకెక్కించినట్టుగా అంత సహజంగా చిత్రాన్ని తీసే దర్శకుడి కోసం సురేష్ బాబు బాగానే ప్రయత్నిస్తున్నాడు. అయితే తమిళ నేటివిటీతో కూడిన ఆ చిత్రాన్ని, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసే గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ జాబితాలో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి.

శ్రీకాంత్ అడ్డాల అంటూ మరో ప్రచారం..

శ్రీకాంత్ అడ్డాల అంటూ మరో ప్రచారం..

ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి దర్శకుడి విషయంలో ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. మొదటగా ఓంకార్ దర్శకత్వం వహిస్తాడని టాక్ రాగా.. అటుపై తరుణ్ భాస్కర్, హను రాఘవపూడి వంటి వారి పేర్లు వినిపించాయి. ఒకానొక దశలో ఒరిజినల్‌ను తెరెకెక్కించిన వెట్రి మారన్‌ను తీసుకుందామని ప్రయత్నాలు చేసినట్టు వినికిడి. అయితే తాజాగా వస్తోన్న వార్తల ప్రకారం శ్రీకాంత్ అడ్డాలను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

హీరోయిన్ విషయంలోనూ..

హీరోయిన్ విషయంలోనూ..

ధనుష్‌కు జోడిగా మంజు వారియర్ అద్భుతమైన నటనను కనబరిచి అందరి ప్రశంసలు అందుకుంది. అలాంటి రా మెటిరీయల్ పాత్రలో నటించేందుకు మొదటగా శ్రియాను అనుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఆపై మరికొంత మంది పేర్లు కూడా పరిశీలించినట్టు టాక్ నడిచింది. అయితే తాజాగా ఓ హీరోయిన్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

వెంకీకి జోడిగా స్వీటి..

వెంకీకి జోడిగా స్వీటి..

ఇంతవరకు రెండు సినిమాల్లో వెంకటేష్‌కు జోడీగా నటించిన అనుష్కను మంజు వారియర్ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ఇప్పటికే అనుష్క నిశ్శబ్దం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుండగా.. ఇది కూడా నటనకు ప్రాధాన్యమున్న చిత్రం కావడంతో స్వీటీ కూడా ఓకే చెప్పి ఉంటుందని అంటున్నారు. మరి ఇది నిజమో కాదో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు ఆగాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X