ఎన్టీఆర్ కోసం మాస్ డైరెక్టర్‌తో అశ్వనీదత్ అదిరిపోయే ప్లాన్.. ఇది వర్కౌట్ అయితే పండుగే.!

By Manoj

కొంత కాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'టెంపర్' నుంచి అతడు వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి సూపర్ హిట్లను సాధించాడు. ఈ క్రమంలోనే రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఎన్టీఆర్‌ కోసం మాస్ డైరెక్టర్‌తో కలిసి అదిరిపోయే ప్లాన్ చేశారని తెలిసింది. ఇది కనుక వర్కౌట్ అయితే ఫ్యాన్స్‌కు పండుగే అంటున్నారు. ఇంతకీ ఏంటా ప్లాన్.? వివరాల్లోకి వెళితే....

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమైన ఎన్టీఆర్

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగమైన ఎన్టీఆర్

వరుస హిట్లతో జోరుమీదున్నాడు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRRలో అతడు నటిస్తున్నాడు. రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీంగా చేస్తుండగా, చెర్రీ.. అల్లూరిలా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న ఇది విడుదల కానుంది.

పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన నందమూరి హీరో

పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన నందమూరి హీరో

RRRలో నటిస్తుండగానే.. తారక్ మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. గతంలో తనకు ‘అరవింద సమేత'తో సూపర్ హిట్ అందించిన త్రివిక్రమ్‌తో అతడు ఈ మూవీ చేయనున్నాడు. కల్యాణ్ రామ్, రాధాకృష్ణ నిర్మించే ఈ సినిమాకు ‘అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌లో రానుందని ప్రచారం జరుగుతోంది.

బడా నిర్మాతతో భారీ సినిమా.. ఫ్యాన్స్‌కు పండుగే

బడా నిర్మాతతో భారీ సినిమా.. ఫ్యాన్స్‌కు పండుగే

వరుస సినిమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే RRRతో పాటు త్రివిక్రమ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అతడు.. మరో భారీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది. దీనికి తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించనున్నాడని ఓ న్యూస్ లీక్ అయింది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ నిర్మిస్తారని సమాచారం.

రెండు సార్లు కలిసినా హిట్ మాత్రం రాలేదు

రెండు సార్లు కలిసినా హిట్ మాత్రం రాలేదు

గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ‘కంత్రీ', ‘శక్తి' అనే రెండు సినిమాలు చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ రెండింటినీ మెహర్ రమేశ్ తెరకెక్కించాడు. ‘కంతీ' బిలో యావరేజ్‌గా నిలిచినప్పటికీ... ‘శక్తి' మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమాతో అశ్వనీదత్‌కు భారీ నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో మరో సినిమా మాత్రం చేయలేదు.

 ఆయనకు అప్పుడే హామీ ఇచ్చిన జూనియర్

ఆయనకు అప్పుడే హామీ ఇచ్చిన జూనియర్

రెండు సార్లు కలిసి పని చేసినప్పటికీ హిట్ రాకపోవడంతో అటు అశ్వనీదత్, ఇటు ఎన్టీఆర్ నిరాశకు లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ఎప్పటికైనా మరో సినిమా చేస్తానని తారక్ హామీ ఇచ్చాడని తెలిసింది. కొద్ది రోజుల క్రితం జరిగిన పలు ఇంటర్వ్యూల్లో అశ్వనీదత్ కూడా త్వరలోనే అతడితో సినిమా చేస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Recommended Video

NTR31 Film With Atlee, Will Be Another Big Pan India Movie
మాస్ డైరెక్టర్‌తో అశ్వనీదత్ అదిరిపోయే ప్లాన్

మాస్ డైరెక్టర్‌తో అశ్వనీదత్ అదిరిపోయే ప్లాన్

ఇటీవల అట్లీతో తారక్ సినిమా చేయబోతున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చినప్పటికీ.. నిర్మాత ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు. ఇప్పుడు మాత్రం అశ్వనీదత్ పేరు లీక్ అయింది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు కావడంతో అట్లీ ఈ మూవీని ఐదు భాషల్లో తెరకెక్కించనున్నాడని అంటున్నారు. షారూఖ్‌తో సినిమా తర్వాత అతడు ఎన్టీఆర్‌ మూవీని పట్టాలెక్కిస్తాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X