ఫస్ట్ టైమ్ రాజమౌళిపై ఒత్తిడి.. అల్లు అర్జున్, అట్లీ కారణమా?
రానున్న ఇండియన్ సినిమా ఫ్యూచర్ లో ఒక్క ఇండియా వైడ్ గా మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా సంచలనం సెట్ చేసే స్కోప్ ఉన్న సినిమా మన నుంచి ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా ఆర్ ఆర్ ఆర్ తో గ్లోబల్ సంచలనంగా మారిపోయిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయికలో చేస్తున్న సినిమా కోసమే అని చెప్పవచ్చు.
దీనిపై ఎనలేని హైప్ ఉంది. అయితే ఈ సినిమా విషయంలో ఇపుడు కొన్ని ఆసక్తికర చర్చలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్నది పోటీ ప్రపంచం. ఒకప్పుడు ఇండియన్ సినిమా దగ్గర అడ్వాన్స్డ్ సినిమాలు తీసేది ఒక్క శంకర్ అనుకుంటే తనని మించిన రేంజ్ లో రాజమౌళి ఇపుడు మారిపోయారు. ప్రస్తుతానికి ఇండియన్ సినిమా ఫేస్ గా తాను నిలిచారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒకప్పుడు శంకర్ ని మించిన దర్శకునిగా రాజమౌళి వచ్చారు. రేపు రాజమౌళిని మించే దర్శకుడు రాడా అంటే లేదనే చెప్పలేం కదా..! సో ఇపుడు జక్కన్నకి ఈ టెన్షన్ పట్టుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పోటీ ప్రపంచంలో ఇండియన్ సినిమా దగ్గర చాలా మంది యువ దర్శకులు ఈజీగా 1000 కోట్ల సినిమాలు పెడుతున్నారు.
కాగా ఇంకో పక్క రాజమౌళి బ్రాండింగ్ లేకుండా ఇండియన్ ఇండస్ట్రీ హిట్ సెట్ చేసిన హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇపుడు పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ ని 1000 కోట్లు వసూళ్లు ఉన్న యువ దర్శకుడు అట్లీతో చేస్తున్నాడు. కాగా ఇపుడు ఈ కాంబినేషన్ విషయంలోనే జక్కన్నపై ప్రెజర్ పడిందట. ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టుకోని అట్లీ, అల్లు అర్జున్ సినిమా అనౌన్సమెంట్ తోనే పాన్ ఇండియా లెవెల్లో సంచలనం రేపింది.
పైపెచ్చు ఐపీఎల్ లో కూడా ఈ వీడియో ప్రమోషన్స్ స్టార్ట్ చేసేయడం ఇంకో షాకింగ్ ట్విస్ట్ అని చెప్పాలి. దీనితో మహేష్ బాబు అభిమానులు జక్కన్న అండ్ టీం పై ప్రెజర్ చేస్తున్నారు. నిజానికి రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ అనేది అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కంటే గట్టి పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్. అలాంటిది ఈ సినిమాకి మినిమమ్ అనౌన్సమెంట్ కూడా లేకపోవడంతో అసలు రచ్చ ఇప్పుడు మొదలైందట.
ఇక ఆలస్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది అని ఇపుడు రాజమౌళి అండ్ కో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. దీనితో మహేష్ సినిమాపై ఒక మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్ ని సిద్ధం చేసే పనిలో పడ్డట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో గ్లోబల్ లెవెల్ రీచ్ అంటే ఏంటో చూపించాలని జక్కన్న డిసైడ్ అయ్యారట. మెయిన్ గా అల్లు అర్జున్, అట్లీ సినిమా అనౌన్సమెంట్ బీట్ చేసే రేంజ్ లో ప్లానింగ్ లు చేస్తున్నట్టుగా ఊహాగానాలు ఇపుడు వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ చిన్నగా జక్కన్నపై ప్రెజర్ ని తీసుకొచ్చిందనే మాటలు ఇపుడు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











